Indian Railways: వేసవి రద్దీ నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల అదనపు రైళ్లు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఇప్పటికే ఉన్న స్పెషల్ ట్రైన్స్ ను పొడిగిస్తోంది. అందులో భాగంగానే నైరుతి రైల్వే (SWR) విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా SMVT బెంగళూరు- విశాఖపట్నం మధ్య వీక్లీ స్పెషల్ రైలును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మరో నెల పాటు అదనపు ట్రిప్పులు నడిపించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
జూన్ 29 వరకు స్పెషల్ ట్రైన్ సర్వీసులు
నిజానికి SMVT బెంగళూరు- విశాఖపట్నం మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు సర్వీసులు మే 25న ముగియాల్సి ఉంది. కానీ, ప్రయాణీకుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో రైలు నెంబర్ 08581 (విశాఖపట్నం–SMVT బెంగళూరు)ను జూన్ 29 వరకు నడపనున్నట్లు నైరుతి రైల్వే (SWR) తెలిపింది. తిరుగు ప్రయాణంలోఇదే రైలు 08582 (SMVT బెంగళూరు–విశాఖపట్నం) జూన్ 30 వరకు నడుస్తుందని తెలిపింది.
బెంగళూరు- విశాఖ నడుమ మొత్తం 10 ట్రిప్పులు
నెల రోజుల పాటు పొడిగించిన SMVT బెంగళూరు- విశాఖపట్నం మధ్య వీక్లీ స్పెషల్ రైలు మొత్తం 10 ట్రిప్పులు వేయనుంది. వాటిలో 5 ట్రిప్పులు బెంగళూరు నుంచి విశాఖకు కాగా, మరో 5 ట్రిప్పులు విశాఖ- నుంచి బెంగళూరుకు కొనసాగనున్నాయి. ఈ ప్రత్యేక రైలుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ అలాగే కొనసాగుతుందని నైరుతి రైల్వే ప్రకటించింది. అంతేకాదు, ప్రస్తుతం ఆగుతున్న అన్ని రైల్వే స్టేషన్లలో పొడిగించిన సర్వీసులు కూడా ఆగుతాయని వెల్లడించింది.
Read Also: వామ్మో.. ఇండియన్ రైల్వే ఇన్ని ఆఫర్లు అందిస్తుందా? అస్సలు తెలియదే!
అవసరం అయితే మళ్లీ పొడిగింపు
రద్దీ నేపథ్యంలో అందుబాటులోకి తీసుకొచ్చిన SMVT బెంగళూరు- విశాఖపట్నం మధ్య వీక్లీ స్పెషల్ రైలు సేవలను ప్రయాణీకులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయాలన్నారు. రద్దీ ఇలాగే కొనసాగితే, ఈ సర్వీసును మరింత పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని నైరుతి రైల్వే అధికారులు ప్రకటించారు.
Read Also: రైలు టికెట్ పై డబ్బులు ఆదా చెయ్యాలా? ఈ క్రెడిట్ కార్డ్స్ ట్రై చెయ్యండి.. నమ్మలేని ఆఫర్లు!