BigTV English

Maha kumbhabhishekam in Srisailam : శ్రీశైలంలో మహాకుంభాభిషేకం వాయిదా ఎందుకంటే

Maha kumbhabhishekam in Srisailam : శ్రీశైలంలో మహాకుంభాభిషేకం వాయిదా ఎందుకంటే


Maha kumbhabhishekam in Srisailam : కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాలను అల్లాడిస్తున్నాయి. కొన్ని చోట్ల బండలు పగులుతుంటే మరికొన్ని చోట్ల పంటలు సైతం తగలబడి పోతున్నాయి ఆస్థాయిలో ఎండల తీవ్రత ఉండటంతో జనం బయటకి రావడానికి కూడా జంకుతున్నారు. వడదెబ్బతో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో జనం ఇంటి నుంచి బయటకి రావడం లేదు. అందుకే శ్రీశైలంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమానికి భక్తుల సందడి కనిపించలేదు.అది ఏస్థాయిలో ఉంటే మహా కుంభాభిషేకాన్నివాయిదా వేసే స్థాయిలో ఉంది.

శ్రీశైలంలో ఏదైనా పూజ తలపెట్టారంటే భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. మలన్న దర్శనం కోసం క్యూలు కడుతుంటారు. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా ఎండలు భయపెడుతుండటంతో మహాకుంభాభిషేకానికి భక్తుల దూరమయ్యారు. దీంతో వాయిదా వేయకతప్పలేదని దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ప్రకటించారు.


అంతేకాదు గత వారం జరిగిన అష్టోత్తర శతకుండాత్మక శ్రీ చండీ రుద్ర రాజశ్యామ సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞానికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఊహించన స్థాయిలో భక్తులు రాలేదు. దీంతో అతి తక్కువ భక్తుల మధ్యే మహాయజ్ఞం పూర్తి చేయాల్సి వచ్చింది. మాడు పగిలేలా ఉన్న ఎండల వల్లే భక్తుల రాలేదని అధికారులు నిర్దారణకి వచ్చారు. అందుకే కొన్ని పూజల్ని వాయిదా వేయక తప్పలేదు.

ఈనెల 25 తలపెట్టిన మహా కుంభాభిషేకాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. షెడ్యూల ప్రకారం ఈనెల 25న మొదలైన 31 వరకు నిర్వహించాల్సి ఉంది. భక్తులను దృష్టిలో పెట్టుకునే మహాకుంభాషేకాన్ని కార్తీక మాసానికి వాయిదా వేశారు.అప్పుడేతే విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారని దేవస్థానం భావించి ఈనిర్ణయం తీసుకుంది. భక్తులు లేకుండా నిర్వహించే ఏ ఉత్సవమైనా ఆనందాన్ని ఇవ్వదు.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×