BigTV English

Zodiac Signs: భద్ర మహా పురుష రాజయోగం – ఆ మూడు రాశుల వారి తలరాతే మారిపోతుంది.

Zodiac Signs: భద్ర మహా పురుష రాజయోగం – ఆ మూడు రాశుల వారి తలరాతే మారిపోతుంది.

Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహల సంచారం కారణంగా కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడ్డ యోగాలు హఠాత్తుగా కొన్ని రాశి జాతకులను కుబేరులను చేస్తే.. కొన్ని రాశి వారిని బిచ్చగాళ్లను చేస్తుంటాయి. ఇంకా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వాళ్లు సడెన్‌ గా అన్ని సమస్యలు తీరి హాయిగా బతుకుతుంటారు. అలాగే ఏ కష్టం లేకుండా హాయిగా బతుకుతున్న వాళ్ల జీవితాలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యి అధః పాతాళానికి దిగజారిపోతుంటారు. అయితే జూన్‌ నెలలో రాబోయే భద్ర మహా పురుష రాజయోగం మాత్రం మూడు రాశులకు చెందిన వ్యక్తుల జీవితాలను మార్చనుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.  వారి కష్టాలు తీరి సుఖపడే రోజులు రాబోతున్నాయి అంటున్నారు. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.


భద్ర మహా పురుష రాజయోగం కారణంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాశుల వారికైతే తల రాత మారిపోతుంది. జూన్‌  నెలలో గ్రహాల సంచారం కారణంగా.. ఈ భద్ర మమా పురుష రాజయోగం ఏర్పడనుంది.  గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు.. గ్రహాల రాజకుమారుడైన బుధుడు ఒకే రాశిలోకి వెళ్తున్నారు. ఇలా వెళ్లడాన్నే  భద్ర మహా పురుష రాజయోగం అంటారని పండితులు చెప్తున్నారు.

సింహ రాశి: భద్ర మహా పురుష రాజయోగం వల్ల సింహ రాశి జాతకుల తలరాత పూర్తిగా మారిపోతుంది. ఆర్థికంగా అనేక లాభాలను పొందుతారు. ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం వరం లాంటిదని చెప్పాలి. వ్యాపారంలో అఖండ లాభాలు అర్జిస్తారు. అలాగే తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. అలాగే కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగుకులకు వృత్తిలో అనేక రకాలైనా అభివృద్ది మార్పులు వస్తాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యకు ఉన్న  ఆటంకాలు తొలగిపోయి విదేశీ యానివర్సిటీలలో చదువుకునే అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే  వాటి నుంచి బయట పడతారు. అయితే ఎదుటి వారితో మాట్లాడే సమయంలో కొంచెం నిగ్రహం పాటించాలి. అప్పుడే మీకు తిరుగులేని జీవితం పొందే అవకాశం వస్తుంది.


కన్యా రాశి : భద్ర మహా పురుష రాజ యోగం రావడం వల్ల కన్యా రాశి జాతకుల జీవితాలు మారిపోనున్నాయి. ఇంత వరకు మిమ్మల్ని చీ కొట్టిన వారే మీ సాయం కోసం వచ్చే సమయం ఆసన్నమైంది. మీరు చేసే వ్యాపారాలు అధికమైన లాభాలను అందిస్తాయి. ఉద్యోగులకు అనుకున్న ప్రమోషన్లు వస్తాయి. పై అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా బలంగా తయారవుతారు. అద్బుతమైన విజయాలను మీ జీవితంలో సాధిస్తారు. భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేస్తారు.

మిథున రాశి: మిథున రాశి జాతకులపై కూడా భద్ర మహా పురుషయోగం అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ జాతకుల వైవాహిక జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. జీవివ భాగస్వామితో చర్చించి ఏ నిర్ణయమైనా తీసుకుని పని చేస్తే అందులో సక్సెస్‌ అవుతారు. దీంతో అఖండమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థికంగా లాభపడితే మీకున్న సమస్యలు తొంభై తొమ్మిది శాతం పరిష్కారం అవుతాయి. సంపాదన పెరిగి పది మందికి సాయం చేసే స్థాయికి మీరు చేరుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఈ మూడు రాశులకు భద్ర మహా పురుష రాజయోగం కారణంగా వీళ్ల తలరాత మారిపోతుంది.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్‌ టీవీ  సొంతంగా క్రియేట్‌ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×