Kingdom First Review: రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. చివరిగా ‘ఫ్యామిలీ స్టార్’, ‘ఖుషి’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రౌడీ స్టార్ నుంచీ వస్తున్న నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం కింగ్డమ్ (Kingdom). గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuri) దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మే 30వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ సాంగ్స్ విడుదల అవ్వగా.. వీటికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే అటు ప్రమోషన్స్ తో కూడా సినిమాపై హైప్ పెంచేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాపై తన మొదటి రివ్యూ పంచుకున్నారు. మరి అనిరుద్ ఇచ్చిన రివ్యూ మేరకు విజయ్ దేవరకొండ గట్టెక్కుతాడో లేదో ఇప్పుడు చూద్దాం.
కింగ్డమ్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన అనిరుధ్ రవిచంద్రన్..
గతంలో గౌతం తిన్ననూరి – నాని కాంబినేషన్లో వచ్చిన జెర్సీ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రాబోతున్న కింగ్డమ్ చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కింగ్డమ్ సినిమా గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “కింగ్డమ్ సినిమా చివరిలో 45 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది. యాక్షన్ సీన్స్, విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అదిరిపోయాయి. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ తన ఫస్ట్ రివ్యూ పంచుకున్నారు. ఇక దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూవీ పై అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది.
కింగ్డమ్ సినిమా విశేషాలు..
కింగ్డమ్ సినిమా విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఇది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా టీజర్ ను ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో ఫిబ్రవరి 12న విడుదల చేసి, భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ టీజర్ ప్రేక్షకులపై సరికొత్త అంచనాలు పెంచేసింది. ఇక గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అందిస్తుందని, అప్పుడే టీజర్ ద్వారా అభిమానులు కామెంట్లు చేశారు. ఇప్పుడు దీనికి తోడు అనిరుధ్ రవిచంద్రన్ కూడా సినిమా చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని, విజయ్ దేవరకొండ అసలైన పెర్ఫార్మన్స్ చూస్తారని కామెంట్లు చేయడంతో ప్రతి ఒక్కరు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:HBD Trisha Krishnan: 42 ఏళ్లు వచ్చినా పెళ్లికి దూరం.. ఏకంగా అంత మందితో ఎఫైర్ నడిపారా..?