Chanakyaniti: భారతీయ సంస్కృతిలో జీవితం యొక్క లోతులను అర్ధం చేసుకోవడానికి చాణక్య నీతి మార్గ నిర్దేశం చేస్తుంది. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని పిలవబడే చాణక్యుడు తన లోతైన ఆలోచనలు, రాజకీయ చతురతకు ప్రసిద్ది చెందాడు. ఆయన ఇచ్చిన నైతిక సూక్తులు జీవితంలో నిజమైన స్నేహితులను గుర్తించి వారితో కనెక్ట్ అవ్వడానికి మనల్ని ప్రేరేపిస్తాయి. చాణక్య నీతి ప్రకారం నిజమైన స్నేహితులు ఎవరో వారిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వీరికి దూరంగా ఉండటం బెటర్ :
చాణక్య నీతి ప్రకారం.. జీవితంలో నిజమైన స్నేహితుడి ప్రాముఖ్యత అపారమైనది. ప్రతి పరిస్థితిలోనూ మీకు మద్దతు ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు అని అలాంటి వారు మాత్రమే మీకు పూర్తిగా విధేయులుగా ఉంటాడని చాణక్యుడు తెలిపాడు. అంతే కాకుండా కష్ట సమయాల్లో మీతో నిలబడే వ్యక్తి నిజానికి మీ నిజమైన స్నేహితుడు అని చాణక్యుడు చెప్పాడు. అతని విధానం ప్రకారం.. మంచి సమయాల్లో మీతో ఉండి, చెడు సమయాల్లో దూరమయ్యే వ్యక్తులు నిజమైన స్నేహితులు కాదు.
నిజమైన స్నేహితుడికి ఈ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. స్నేహంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరమని చాణక్యుడు భావించాడు. అవి లేకుండా ఏ స్నేహితుడిని నిజమైనవాడు అని చెప్పలేము. వీటిలో మొదటిది నిస్వార్థం.
నిజమైన స్నేహితుడు అంటే నిస్వార్థంగా మీతో ఉండే వారు అని చెప్పవచ్చు. మరో మాటలో చెప్పాలంటే.. తన సొంత ప్రయోజనం కోసం కాకుండా ప్రేమ, నమ్మకం కారణంగా మీతో సంబంధాన్ని ఏర్పరచుకునే వ్యక్తిని నిజమైన స్నేహితుడు అంటారు.
మీ ఆసక్తికి అనుగుణంగా పనిచేసేవాడే నిజమైన స్నేహితుడు అని, మీ తప్పులను ఎత్తి చూపడానికి వెనుకాడని వారుచ, మీ విజయాన్ని మీలాగే సంతోషంగా తీసుకునే వారని చాణక్యుడు నమ్ముతాడు. నిజమైన స్నేహితులు మీకు సత్య మార్గాన్ని చూపిస్తారు. అంతే కాకుండా మీరు తప్పు మార్గంలో వెళుతుంటే.. కూడా సరైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు.
తన సొంత ప్రయోజనం గురించి మాత్రమే ఆలోచించే స్నేహితుడిని దూరంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం.. అలాంటి వ్యక్తులు పైకి మంచిగా కనిపించవచ్చు కానీ వారికి మీ పట్ల అంతర్గతంగా గౌరవం లేదా నిజమైన ప్రేమ వారికి ఉండదు. ఈ విధానం మనల్ని బాహ్య ప్రవర్తన ద్వారా మాత్రమే కాకుండా.. ఒక వ్యక్తి మనస్సాక్షి ,చర్యలను గుర్తించమని హెచ్చరిస్తుంది.
Also Read: సర్వార్థ సిద్ధి యోగం.. ఏప్రిల్ 7 నుండి వీరిపై లక్ష్మీ దేవి అనుగ్రహం
కష్ట సమయాల్లో కూడా మనల్ని విడిచిపెట్టని వారే నిజమైన స్నేహితులు అని చాణక్య నీతి మనకు బోధిస్తుంది. ఈ విధానం మన స్నేహాన్ని బలంగా ఉంచుకోకుండా.. మన సంతోషంలో, దుఃఖంలో మనతో పాటు ఉండే వారిని మాత్రమే మన నిజమైన స్నేహితులుగా పరిగణించమని ప్రేరేపిస్తుంది. ఎవరైతే మన కష్టాల్లో కూడా మనకు అండగా ఉండి మన సంతోషాన్ని కోరుకుంటారో వారు మాత్రమే నిజమైన స్నేహితులు అని చెబుతుంటారు. వారిని మాత్రమే మనం నమ్మాలి.