BigTV English
Advertisement

Sukumar Movie : ఏది ఏమైనా… భలే క్రియేట్ చేశారు…

Sukumar Movie : ఏది ఏమైనా… భలే క్రియేట్ చేశారు…

Sukumar Movie : సుక్కు… ఇప్పుడు ఓ సెన్సేషన్. పుష్ప 2 తర్వాత ఈ క్రియేటివ్ డైరెక్టర్ స్థాయి మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఈయనతో సినిమా చేయడానికి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా… ముందుకు వస్తారు. అంతటి నేమ్ అండ్ ఫేమ్ ను తెచ్చి పెట్టింది పుష్ప 2 మూవీ. అందుకే ఆయన మీద అలాంటి గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి సుకుమార్ పై ఓ గాసిప్ తెగ చెక్కర్లు కొట్టింది. ఆ గాసిప్ ఏంటి..? అది గాసిప్ అయితే… అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్ధాం…


పుష్ప 2 తర్వాత సుకుమార్ మూవీ రామ్ చరణ్‌తో ఉందని అందరికీ తెలిసిన సంగతే. RC 17 గా ఆ మూవీ రాబోతుంది. అయితే దీని తర్వాత పరిస్థితేంటి..? అనేది ఓ చర్చ జరిగింది. అలా… ఓ గాసిప్ వచ్చింది. అదే.. సుకుమార్ బాలీవుడ్ కి వెళ్లబోతున్నాడు అని.

రామ్ చరణ్‌తో మూవీ అయిన తర్వాత సుకుమార్ బాలీవుడ్ బాట పట్టబోతున్నాడు అంటూ వార్తలు కుక్ చేశారు. కొంత మంది ఇంకాస్త ముందడుగు వేసి.. ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తోనే సుక్కు మూవీ చేస్తున్నాడు అంటూ కథలు అల్లేశారు.


అంతే కాదు… షారుక్ ఖాన్‌కు ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ కథ చెప్పాడని, అది షారుక్ కూడా నచ్చిందని అని, RC 17 మూవీ అయిన తర్వాత పట్టాలెక్కబోతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే సుక్కు బాలీవుడ్ బాట పట్టడం, షారుక్ ఖాన్ తో సినిమా చేయడం, పల్లెటూరి కథ చెప్పడం లాంటి వాటిలో ఎలాంటి నిజం లేదట. ఈ పూకార్లపై సుకుమార్ టీం స్పందించి క్లారిటీ ఇచ్చింది.

సుకుమార్ ప్రస్తుతం ఫోకస్ మొత్తం కూడా RC 17 పైనే ఉంది. దీని తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప 3 చేయబోతున్నాడు. ఈ పుష్ప 3 ని 2028 లో రిలీజ్ చేయబోతున్నట్టు స్వయంగా నిర్మాతే చెప్పాడు. అంటే… సుకుమార్ లైనప్… RC 17, పుష్ప 3 ర్యాంపేజ్. మాత్రమే ఇవి రెండు కంప్లీట్ అవ్వడానికి 2028 అవుతుంది.

పుష్ప 3 తర్వాత…

2028లో పుష్ప 3 ని రిలీజ్ చేసిన తర్వాత సుకుమార్ బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే… సుక్కు ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉందని చాలా రోజుల నుంచి వినిపిస్తున్న మాట. దీంతో… పుష్ప 3 అయిపోయినా… సుక్కు టాలీవుడ్ విడిచి బాలీవుడ్ కి వెళ్లడం కష్టమే అని చెప్పొచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×