BigTV English

Betting Apps Case: హైదరాబాద్ మెట్రో పై బెట్టింగ్ ప్రమోషన్స్.. మరి దీన్నేం చేస్తారో?

Betting Apps Case: హైదరాబాద్ మెట్రో పై బెట్టింగ్ ప్రమోషన్స్.. మరి దీన్నేం చేస్తారో?

Betting Apps Case:గత కొన్ని సంవత్సరాలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ భారీగా డబ్బు సొంతం చేసుకుంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రోజు రోజుకి కోట్లకు పడగలెత్తుతున్న విషయం తెలిసిందే. కానీ వీరిని నమ్ముకొని బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి నష్టపోయిన ఎంతో మంది ప్రజలు అప్పులు తీర్చలేక, ఉన్న డబ్బును కోల్పోయి చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే గతంలో ఎక్కడో ఒకరో ఇద్దరో మాత్రమే ఈ బెట్టింగ్ యాప్ లో మోసపోయి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సంఖ్య పెరిగిపోయింది. కారణం కష్టపడకుండా ఉచితంగా డబ్బు రావాలి.. ఇలా రావాలి అంటే బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టడమే మార్గం అన్నట్టుగా ఎంతోమంది యువతను టార్గెట్గా చేసుకొని, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ తెగ ప్రమోట్ చేస్తున్నారు. లాప్టాప్ లో అలా నొక్కగానే ఇలా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బు క్రెడిట్ అవుతున్నట్లు ఫేక్ వీడియోలు సృష్టించి మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఫేక్ అని తెలియని వాళ్ళు ఎంతోమంది ఈ బెట్టింగ్ భూతానికి బానిస అవుతుంటే.. మరికొంతమంది చదువుకున్న వారు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం లేదా బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టడం లాంటివి చేసి చివరికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఈ క్రమంలోనే ఇప్పుడు రోజు రోజుకి కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఐఏఎస్ వీసీ సజ్జనార్ రంగంలోకి దిగారు. అందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారో వారందరిని దాదాపు ఐడెంటిఫై చేశారు. అంతే కాదు యువతకి కూడా పిలుపునిస్తూ.. ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు మీకు కంటపడితే, నేరుగా స్క్రీన్ షాట్ తీసి తనకు డైరెక్ట్ గా మెసేజ్ పంపించమని కూడా కోరారు. దీంతో యూట్యూబర్ లతో పాటు చాలామంది సినీ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి.
యూట్యూబర్స్ గా పేరు సొంతం చేసుకున్న ఎంతోమంది తో పాటూ నిత్యం ఆరాధించే అభిమాన నటీనటుల పేర్లు కూడా బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆఖరికి మెట్రో రైలుపై కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తూ డిజిటల్ ప్రింట్ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది .ముఖ్యంగా 1XBAT అని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇలా పబ్లిక్ గా చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో వారిపై కేసు ఫైల్ చేసి, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నారు. మరి ఈ మెట్రో ట్రైన్ పరిస్థితి ఏంటి ? అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా బస్సులు , ఆటోలు ఆఖరికి ఇలా మెట్రో రైళ్లపై కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ను ఈ విధంగా ప్రమోట్ చేయడం పై కూడా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాయో చూడాలి.


Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×