BigTV English

Ketu Nakshatra Transit: కేతువు నక్షత్ర మార్పు.. జూలై 8 నుంచి ఈ రాశుల వారు జాగ్రత్త !

Ketu Nakshatra Transit: కేతువు నక్షత్ర మార్పు.. జూలై 8 నుంచి ఈ  రాశుల వారు జాగ్రత్త !

Ketu Nakshatra Transit 2024: ప్రస్తుతం కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం ఇదే రాశిలో ఉంటాడు. నవగ్రహాలలో కేతు, రాహువులు ఎప్పుడు తిరోగమన దశలోనే సంచరిస్తారు. కేతువు ఈ ఏడాది రాశిని మార్చకపోయినా నక్షత్రాన్ని మార్చుకుంటూ తన ప్రభావాన్ని అన్ని రాశులపై చూపిస్తాడు. కేతువు జూలై 8న హస్తా నక్షత్రంలోకి సంచరించనున్నాడు.


హస్తా నక్షత్రం:
చంద్రుడు హస్తా నక్షత్రానికి అధిపతి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి స్నేహితులుగా ఉంటారు. వీరు అందంగా,ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు. కానీ వీరికి అదృష్టం అన్ని సార్లు కలిసిరాదు. వ్యాపారం వృద్ధి చేసుకుంటారు. కానీ విజయం సాధించేందుకు మాత్రం చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది.
కేతు సంచారం:
జూలై 8 నుంచి కేతు గ్రహం తిరోగమన దిశలో కదులుతూ హస్తా నక్షత్రంలోని రెండవ దశలోకి వెళ్లనుంది. కేతువు తిరోగమన కదలిక కారణంగా కొన్ని రాశులపై చెడు ప్రభావం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 8 వ  తేదీ వరకు కేతువు హస్తా నక్షత్రం రెండవ స్థానంలో ఉంటాడు. దీని తర్వాత కేతు హస్త నక్షత్రం మొదటి స్థానంలో సంచరిస్తుంది. జూలై 8న కేతు సంచారం వల్ల ఏ రాశుల వారికి ఒత్తిడి పెరుగుతుందిలో ఇప్పుడు తెలుసుకుందాం.
తులా రాశి:
తులా రాశి రెండవ స్థానంలో కేతువు సంచారం సంచరించడం వల్ల ఈ వారికి అంత కలిసి రాదు .ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులను మీరు ఎదుర్కొంటారు. జీవితంలో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం.
కన్యా రాశి:
కేతువు నక్షత్ర సంచారం వల్ల కన్యా రాశి వారికి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా సహోద్యోగులతో వాద ప్రతివాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మితిమీరిన ఖర్చు మీ మనసును కలవరపెడుతుంది. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి.
Also Read: నవంబర్ వరకు ఈ 4 రాశుల వారికి శుభ సమయం

కర్కాటక రాశి:
కేతువు సంచారం వల్ల ఆ రాశి వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఏర్పడుతుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. విబేధాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది


Tags

Related News

Ganesh Chaturthi 2025: పండగ రోజు వినాయకుడిని ఈ సమయంలో పూజిస్తే.. అంతా శుభమే !

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ganesh Chaturthi 2025: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?

Old Vishnu idol: అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుమూర్తి.. ఇదొక అద్భుతం.. మీరు చూసేయండి!

Hyderabad to Tirupati Bus: తిరుపతి భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. డబుల్ హ్యాపీ గ్యారంటీ

Mahaganapathi: గంట కడితే కోర్కెలు తీర్చే గణపతి.. ఎక్కడో తెలుసా?

Big Stories

×