E-Paper
Advertisement

Lord Anjaneya: ఆంజనేయస్వామికి ఐదు మంది తమ్ముళ్లున్నారని తెలుసా..?

Lord Anjaneya: ఆంజనేయస్వామికి ఐదు మంది తమ్ముళ్లున్నారని తెలుసా..?
Advertisement

Lord Anjaneya: ఆంజనేయస్వామికి ఐదుగురు తమ్ముళ్లున్నారని మీలో ఎంత మందికి తెలుసు..? ఆ ఐదుగురు తమ్ముళ్లకు పెళ్లిళ్లాయయని.. వారు పిల్లాపాపలతో హ్యాపీగ ఉన్నారని ఎవరైనా ఊహించగలరా..? అదీ కాకుండా అన్న హనుమంతుడు చూపిన శ్రీరాముడి బాటలో ఆ ఐదుగురు తమ్ముళ్లు నడిచారని చూడా చాలా మందికి తెలియని విషయం. అయితే హనుమంతుడి ఐదుగురు తమ్ముళ్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్రహ్మాండ పురాణం ప్రకారం వానర రాజైన కేసరి మరియు అంజనాదేవి దంపతులకు హనుమంతునితో పాటు మరో ఐదుగురు కుమారులు జన్మించారట. ఆరుగురిలో హనుమంతుడు అందరికంటే పెద్దవాడట. అయితే మిగతా అయిదుగురు తమ్ముళ్ల గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ ఐదు మంది గురించి తెలుసుకుందాం.

Advertisement

మతిమాన్ (Matiman): హనుమంతుడి తర్వాత జన్మించిన రెండో సోదరుడే మతిమాన్‌. ఈయన తన పేరుకు తగ్గట్టే అపారమైన బుద్ధిబలము కలవాడట. అలాగే ఎంతో  వివేకం నైపుణ్యం ఉన్న వీరడని పురాణాల్లో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. ఇంకా మతిమాన్‌ దౌత్య నీతిలో (Diplomacy) ఆరితేరినవాడట.

శ్రుతిమాన్ (Shrutiman): హతుమండి రెండో తమ్ముడే ఈ శ్రుతిమాన్‌. ఈ శ్రుతిమాన్‌ వేద వేదాంగాలలో గొప్ప పండితుడట. ఈయనకు ఖగోళ శాస్త్రం (Astronomy), జ్యోతిష్యం, సాహిత్యంపై పట్టు ఉండేదట. ఈయన కూడా యుద్ద విద్యలలో ఆరితేరిన నిపుణుడట.

Advertisement

కేతుమాన్ (Ketuman): ఆంజనేయ స్వామి మూడవ తమ్ముడు కేతుమాన్‌. ఈ కేతుమాన్‌ గొప్ప వీరుడట. రణరంగంలో శత్రువులను ఎదుర్కోవడంలో ఆరితేనిర వాడట.  ఆయుధ విద్యలలో ఈయన మించిన వాళ్లేవరు లేరట. రాక్షసులతో జరిగిన పలు యుద్ధాల్లో ఈయన తన పరాక్రమాన్ని చాటుకున్నట్లు పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయట.

గతిమాన్ (Gatiman): హనుమంతుడి నాలుగవ  సోదరుడే ఈ గతిమాన్‌. గతిమాన్ అత్యంత వేగంగా ప్రయాణించగల శక్తి పరుడట. ఈయన ఆకాశ మార్గంలో పయనించడంలోనూ.. ఎత్తైన కొండలను సులువుగా అధిరోహించడంలో దిట్టట.

ధృతిమాన్ (Dhritiman): హనుమంతుడి తమ్ముళ్లలో ఆఖరివాడు ఐదవ వాడు ఈ ధృతిమాన్‌. ఈయన ఎంతో ఉత్సాహవంతుడట అలాగే హనుమంతుడిపై అమితమైన భక్తి, విధేయత కలిగినవాడట. ఏదైనా విషయంలో పట్టుదల పడితే విడిచేవాడు కాదట. ఇదే ఈయన ప్రధాన గుణమట.

అయితే ఈ ఆరు మంది అన్నదమ్ముల్లో హనుమంతుడు ఒక్కడే బ్రహ్మచారిగా ఉండిపోయాడట. మిగిలిన ఐదుగురు సోదరులు పెళ్లిళ్లు చేసుకుని పిల్లపాపలతో సంతోషంగా జీవితాన్ని గడిపారట. రామరావణ యుద్దంలో రాముడికి అన్న అయిన హనుమంతుడికి తోడుగా ఉన్నారట.

ఇక పురాణాల ప్రకారం వాయుదేవుని అంశతో కుంతీదేవికి జన్మించిన భీముడిని కూడా హనుమంతుడి సోదరుడిగా పరిగణిస్తారట. వీరిద్దరినీ వాయు పుత్రులు అని పిలుస్తారట. అలాగే ఇంకో కథనం ప్రకారం దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞ ప్రసాదాన్ని ఒక తీసుకువెళ్తుండగా అది అంజనాదేవి చేతిలో పడుతుందట. ఆ ప్రసాదాన్ని అంజనాదేవి తినడం వల్ల హనుమంతుడు జన్మించాడని.. అందుకే శ్రీరాముడికి హనుమంతుడు సోదర సమానుడని చెప్తుంటారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మీరు శనివారం పుట్టారా..? మీకు ఏ వయసులో కలిసొస్తుందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×