E-Paper
Advertisement

రూ.1,77,500 జీతంతో ఎన్ఐసీలో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే, APPLY NOW

రూ.1,77,500 జీతంతో ఎన్ఐసీలో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే, APPLY NOW
Advertisement

ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది శుభవార్త.. ఇండియన్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, అప్లికేషన్ ప్రాసెస్ తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్-బి పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామకాల ద్వారా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & డేటా సైన్స్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 243

కంప్యూటర్ సైన్సెస్ & ఐటీ: 168 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్: 25 పోస్టులు
డేటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ): 50 పోస్టులు

Advertisement

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి  సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ, లేదా ఎంటెక్ పాసై ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెలక్షన్ ప్రాసెస్:  అభ్యర్థుల గేట్‌ (2024/2025/2026) వాలిడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తుది ఎంపికలో గేట్ స్కోర్‌కు 60 శాతం, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది.

వయస్సు: 2026 మార్చి 31 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 2026 ఏప్రిల్ 24 (సాయంత్రం 5.30 గంటలకు క్లోజ్) అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. చివరి తేది వరకు వేచి చూడొద్దు.

దరఖాస్తు ఫీజు:  సాధారణ & ఓబీసీ అభ్యర్థులకు రూ.800 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,  మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

వెబ్ సైట్: https://recruitment.nic.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 243

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 24

ALSO READ: BANK OF BARODA: డిగ్రీ పాసైతే చాలు బ్రో.. గోల్డెన్ ఛాన్స్, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×