రాత్రి నిద్రపోయాక ఎంతోమందికి రకరకాల కలలు వస్తాయి. కలలు రాకుండా అడ్డుకోవడం అసంభవం. కొంతమందికి భయపెట్టే కలలు వస్తే కొందరికి ఆ రోజుల్లో తాము ఏ పనులు చేసామో అలాంటి కలలే వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కలలకు స్వప్న శాస్త్రం ఎంతో అర్థం ఉందని చెబుతోంది. కలలో వర్షాన్ని చూడడం కూడా అందులో ఒకటి. మీరు కలలో వర్షం చూస్తే దానికి ఒక అర్థం ఉంది. అయితే అది అశుభదాయకమా లేక శుభదాయకమా అన్నది స్వప్న శాస్త్రం ప్రకారం తెలుసుకోండి.
వర్షం కనిపిస్తే మంచిదేనా?
కలల శాస్త్రం చెబుతున్న ప్రకారం కలలో వర్షం చూడడం అనేది పూర్తిగా శుభసూచకం. త్వరలో మీ జీవితంలో కొన్ని శుభవార్తలు వినబోతున్నారని చెప్పే సూచన. ఈ కల ద్వారా మీ జీవితంలో పెద్ద సానుకూల మార్పులు జరగబోతున్నాయని కూడా ఈ వర్షం చెబుతుంది. కాబట్టి వర్షం కలలో కనిపించడం అనేది ఎంతో శుభకరమైనది.
అప్పుల బాధ
ఇక జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం కలలో ఉరుములతో కూడిన వర్షం, మేఘాలు వంటివి కనిపిస్తే మీరు అప్పుల బాధ నుండి బయటపడే సమయం వచ్చిందని అర్థం. అలాగే పాత పెట్టుబడుల నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారని చెప్పకనే చెబుతున్నట్టే. సంపద, శ్రేయస్సు కూడా మీ ఇంటి తలుపు తడతాయి. అలాగే వర్షం పడుతున్నట్టు కల వస్తే కెరీర్లో మీరు విజయాన్ని అందుకుంటారని కూడా తెలుసుకోవచ్చు.
కలలో వర్షం కనిపించడం అనేది మీ కోరికలు తీరుతాయని చెప్పే సంకేతం కూడా. ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిలో కొన్ని నెరవేరడం కష్టమని కూడా అనిపిస్తుంది. అలాంటి కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పే సూచన ఈ వర్షం. కలలో మీరు వర్షంలో తడిసిపోయినట్టు కనిపిస్తే అది కూడా ఎంతో శుభదాయకం. ఇది జీవితంలో కొత్త అవకాశాలను డబ్బు రాకను సూచిస్తుంది. లేదా ఇంట్లో ఏదైనా శుభ సంఘటన జరగబోతుందని చెబుతుంది. కలలో వర్షం కనిపించడం అనేది కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని చెప్పే సూచన కూడా.