పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పదవీ విరమణ పొందే సమయంలో సన్మాన సభ ఏర్పాటు చేస్తారు. అందరూ వారిని సత్కరిస్తారు. బొకేలు, బహుమతులు ఇస్తారు. ఉద్యోగ సమయంలో వారు చేసిన సేవలను కొనియాడు తారు. ఘనంగా వీడ్కోలు పలుకుతారు. కానీ, సాధారణ అటెండర్ కు ఘనంగా వీడ్కోలు పలకడం ఎప్పుడైనా చూశారా? లేకపోతే, ఈ స్టోరీ తప్పకుండా చదవాల్సిందే.
దాస్ అనే అటెండర్ ఓ విద్యాలయంలో 38 ఏండ్ల పాటు విధులు నిర్వహించాడు. తాజాగా తన ఉద్యోగానికి విరమణ ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు ఘన వీడ్కోలు పలికారు. ఎక్కడా ఊహించని రీతిలో చివరి రోజు, చివరి బెల్ కొట్టే సమయంలో విద్యార్థులంతా ఒక్క చోటకు చేరారు. దాస్ మామ చివరి లాంగ్ బెల్ కొట్టగానే విద్యార్థులంతా చప్పట్లు కొడుతూ, కేరింతల నడుమ ఆయనకు వీడ్కోలు పలికారు.
ఇక ఈ వీడ్కోలకు సంబంధించిన వీడియోను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రత్మి అనే ఇన్ స్టా అకౌంట్ ద్వారా ఈ వీడియో షేర్ చేయడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరు తమ స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంటున్నారు. “అతడు చివరి గంట మోగించే సమయంలో ఉద్వేగానికి గురి కావడం చూస్తుంటే పాఠశాల మీద అతడు పెంచుకున్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “దాస్ మామ చిరునవ్వు, నిశ్శబ్ద అంకితభావం, అతడి ఉనికి అన్నీ పాఠశాల హృదయ స్పందనలో భాగమే. ఈ రోజు అతడు తన చివరి గంట మోగించి ఉండవచ్చు. కానీ, అతడి చివరి హృదయ స్పందన వరకు స్కూల్ అనుభవాలనే నెమరు వేసుకంటారు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “సాధారణ అటెండర్ అయినప్పటికీ, అతడి వీడ్కోలును ఇలా ప్లాన్ చేసినందుకు పాఠశాల యాజమాన్యాన్ని నిజంగా అభినందించాల్సిందే” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టిం వైరల్ అవుతోంది.
Read Also: ప్రతిష్టాత్మక కాలేజీలో అమ్మాయిల ఫైటింగ్, నెట్టింట వీడియో వైరల్.. యాజమాన్యం ఏం చేసిందంటే?