Rudraksha : విష్ణుభక్తులకు యజ్ఞోపవీతం ఎంత ముఖ్యమో.. శైవభక్తులు రుద్రాక్షను అంత ముఖ్యమైంది. వైష్ణవ సంప్రదాయలకు ఉన్న ఆచారాలు, మండి, సంప్రదాయం ఇలాంటి బంధనాలకు శైవులకు లేవు. భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలనూ కులాచారీ విధిలేకుండా ఎవరైనా చేతులతో ముట్టుకుని ఆత్మానందాన్ని పొందవచ్చు. శైవ సంప్రదాయానికి ఉన్న మహా సౌభాగ్యమిది. చతుర్వర్ణాల వారికీ రుద్రాక్షమాల ధరించవచ్చు. ద్రవిడ భారతంలో శ్రీ బసవేశ్వరుడు శైవ సంప్రదాయానికి కొత్తదారులు వేశాడు. కులమత వివక్ష లేకుండా అన్ని జాతులను కలుపుకుని శివలింగ ధారణ చేయించి లింగాయతులను చేశాడు. శైవమతానికి ఎంతో సేవ చేశాడు
రుద్రాక్షకు ఐదు ముఖాలు, ,మూడు ముఖాలు, ఆరేడు ముఖాలు ఇలా రకరకాలు ఉంటాయి. కొంతమంది మూడు ముఖాలు ఉన్నది గొప్పదని, మరికొందరు ఆరు ముఖాలు ఉన్న రుద్రాక్షలు గొప్పవని చెబుతూ మోసం చేస్తుంటారు. ఇవన్నీ కల్పిత కథలు. మనకు లభించే రకరాకల రుద్రాక్షలు హస్త నైపుణ్యంతో చేసినవి. మనిషికి భక్తి దైవనమ్మకం ముఖ్యం గానీ రుద్రాక్ష ముఖ్యం కాదని గుర్తించాలి. నమ్మకం మంచిదే. కాని మూఢ నమ్మకం మంచిది కాదు.
దేవుడు మనకు అన్నీ ఇస్తుంటాడు నువ్వు ప్రత్యేకంగా దేవుడికి సమర్పించక్కర్లేదు. రుద్రాక్షలను ఉంగరాల్లో కలిపి ధరించరాదు. రుద్రాక్షమాలతో భార్య, భర్తలు సంగమం చేయరాదు. ఒకరి రుద్రాక్షలను మరి ఒకరు ధరించ కూడదు. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు. స్త్రీలు రుతుసమయాల్లో తీసి వేయాలంటారు. రుద్రాక్షలు తెలిసి ధరించినా తెలియక ధరించినా రుద్రాక్షల మహత్మ్యం అనుభవంలోకి వస్తుంది. తప్పుడు మార్గాన నడిచేవారు, సత్ప్రవర్తన లేనివారు, దురాచార మనస్కులు , రుద్రాక్షలు ధరిస్తే మార్పు వచ్చి సన్మార్గులు అవుతారని భారతీయుల నమ్మకం.
రుద్రాక్షలు ధరించడానికి మంచి ముహూర్తాలు అవసరం లేదు. మంచి మనసు ఉండటమే మంచి ముహూర్తంతో సమానం.