BigTV English

Ganga Dussehra 2024: గంగా దసరా రోజు ఈ దానాలు ఎందుకు చేస్తారో తెలుసా..

Ganga Dussehra 2024: గంగా దసరా రోజు ఈ దానాలు ఎందుకు చేస్తారో తెలుసా..

Ganga Dussehra 2024: ప్రతి సంవత్సరం, గంగా దసరా పండుగను జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. ఈ పండుగ హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది గంగా దసరాను రేపు జరుపుకోనున్నారు. పురాణాల ప్రకారం, ఈ రోజున గంగామాత భూమిపై అవతరించింది. ఈ రోజున గంగాస్నానం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుంది. గంగా దసరా రోజున గంగా స్నానం చేసిన తర్వాత చేసే దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, పేదలకు శక్తి మేరకు దానం చేయాలి. ముఖ్యంగా నీరు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.


హిందూ గ్రంధాల ప్రకారం, దానం చేయడం గొప్ప పుణ్యం. ఈ దానం ప్రత్యేకమైన రోజున చేస్తే, దాని ప్రాముఖ్యత రెట్టింపు అవుతుంది. హిందూ మతంలో, గంగా నదిని పవిత్రంగా భావిస్తారు. గంగా స్నానం చేయడం ద్వారా చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు గంగా నదిలో స్నానాలు ఆచరించిన వ్యక్తి దేవతల అనుగ్రహాన్ని పొందుతాడని కూడా శాస్త్రం చెబుతుంది. అలాగే గంగా దసరా రోజున దానం చేస్తే భగవంతుని విశేష ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున నీరును తప్పనిసరిగా దానం చేయాలి.

నీరు ఎందుకు దానం చేయాలి..


గంగా దసరా రోజున ప్రజలు నీరు, కుండలు దానం చేస్తారు. ఇది గంగామాతతో సహా అన్ని దేవతలను సంతోషపరుస్తుంది. మత విశ్వాసాల ప్రకారం, వేసవి కాలంలో నీటితో నిండిన కుండను దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. గంగా దసరా పండుగ జ్యేష్ఠ మాసంలో వస్తుంది. జ్యేష్ఠ అంటే తీవ్రమైన వేడి అని అర్థం. ఈ వేడి నుండి ఉపశమనం కోసం ఫ్యాన్, నీరు, కుండను దానం చేస్తారు. ముఖ్యంగా గంగా దసరా రోజున ఫ్యాన్‌, కుండ దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది.

Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×