ఒకరికి దానం చేయడం అనేది ఎదుటివారి అవసరాలను తీర్చడమే కాదు, మీ జీవితానికి కూడా సార్ధకతను ఇస్తుంది. దేవుని ఆశీర్వాదాలు మీకు దక్కేలా చేస్తుంది. పేదవాడిని కూడా రాజుగా మార్చగలిగే కొన్ని రహస్య దానధర్మాలు ఉన్నాయి. వీటిని రహస్యంగా దానం చేయడం వల్ల మీ పేదరికం పోతుంది.
పూర్వం ఎంతోమంది ఇలా దానధర్మాలు చేయడం ద్వారా దారిద్య్రం నుంచి గట్టెక్కారని ధనవంతులుగా మారారని చెప్పుకుంటారు. అయితే ఇప్పటికీ ఎంతోమందికి ఎలాంటి వస్తువులను దానం చేయడం ద్వారా పేదరికం పోగొట్టుకోవచ్చు. ఇక్కడ మేము కొన్ని రకాల వస్తువుల గురించి చెప్పాము. వీటిని దానం చేసి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోండి.
అగ్గిపుల్లలు
మంగళవారం నాడు అగ్గిపెట్టెలను దానం చేయడం ద్వారా ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే ఇది అందరూ చూస్తున్నట్టు కాకుండా రహస్యంగా… ఇస్తున్న వ్యక్తికి తీసుకుంటున్న వ్యక్తికి మాత్రమే తెలియాలి. మంగళవారం నాడు అగ్గిపెట్టెలు దానం చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. మానసిక ఒత్తిడి, ఆర్థిక సంక్షోభాలు, ఆర్థికపరమైన అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల పుణ్యఫలితాలు కూడా వస్తాయి. మీ జీవితం చాలా వరకు మారిపోతుంది.
ఉప్పు
హిందూమతంలో ఉప్పును దానం చేయడం గొప్ప పుణ్యంగా చెప్పుకుంటారు. ఉప్పును దానం చేయడం వల్ల పేదవారి ఆహారం రుచిగా మారుతుంది. దీనివల్ల దానం చేసిన వారి జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అంతేకాదు ఈ ఉప్పును రహస్యంగా దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో ఆనందించి మీ జీవితంలో ఆర్థిక సమస్యలను తొలగిస్తుందని చెప్పుకుంటారు.
కూర్చునే చాప లేదా ఆసనం
కూర్చోవడానికి వీలయ్యే చిన్న చాపలు లేదా ఆసనాలు వంటివి దానం చేయడం కూడా ఎంతో మంచిది. ఆలయంలో కింద వేసుకుని కూర్చుని పూజ చేసే చిన్న చాపలను దానం చేయడం పుణ్యప్రదంగా చెప్పుకుంటారు. భక్తులు ఈ ఆసనాలపై కూర్చొని పూజ చేసినప్పుడు ఆ పుణ్యాలు మీకు కూడా దక్కుతాయి. కాబట్టి ఇలాంటి ఆసనాలను దానం చేయడం మీ జీవితంలో శాంతిని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతను అందిస్తుంది. అలాగే ఈ దానం దేవుని పట్ల మీకున్న భక్తిని కూడా సూచిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం దక్కి తీరుతుంది.
లోటా
శివలింగం పైన నీళ్లు పోయాలంటే లోటా అవసరం. అది రాగిదైనా, ఇత్తడిదైనా పరవాలేదు. ఆ మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు లోటాను దానం చేస్తే ఎంతో మంచిది. దీన్ని కూడా రహస్యంగానే దానం చేయాలి. ఈ రహస్యదానం శివుడి ఆశీస్సులను మీకు అందిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది. మీకు మానసికమైన ప్రశాంతతను అందిస్తుంది. లోటాను దానం చేస్తే మీ కుటుంబంలో కూడా ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.
దీప దానం
కార్తీకమాసంలో ఆలయానికి వచ్చే వారికి మట్టి దీపాలను దానం చేయడం కూడా ఎంతో పవిత్రంగా చెప్పుకుంటారు. ఈ దానం లక్ష్మీదేవి అలాగే విష్ణువును ఎంతో సంతోషపరుస్తుంది. మీరు ఇచ్చే మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లో సానుకూలత దొరుకుతుంది. ఈ దానం వల్ల పూజ ఫలితాలు కూడా మీకు దక్కుతాయి. జీవితంలో ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
పైన చెప్పిన దానాలను రహస్యంగానే ఇస్తే ఎక్కువ ఫలితాలు దక్కుతాయి. అగ్గిపెట్టెలు, దీపం, లోటా, ఆసనం, ఉప్పు… హిందూ మతంలో పుణ్యప్రదమైన దానాలుగా చెప్పుకుంటారు. ఇవి కొనేందుకు అయ్యే ఖర్చు తక్కువే. కానీ జీవితంలోని బాధలను మాత్రం ఎక్కువగా తొలగిస్తాయి. వీటిని అవసరమైన వారికి రహస్యంగా విరాళంగా ఇవ్వాలి.