CM Chandrababu: వైసీపీ అధినేత జగన్‌కు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రౌడీయిజం చేస్తామంటే ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఇప్పటివరకు మంచి తనాన్ని చూశారని, ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. గురువారం ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బాబాయ్‌ను చంపి ఆనాటి ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టే ధైర్యం నేరస్తులకు వచ్చిందంటే ఊహించుకోగలమా అంటూ ప్రశ్నించారు. దాన్ని నమ్మించడానికి సాక్షి పత్రిక, ఛానెల్ పదే పదే చెప్పి సానుభూతి సంపాదించారన్నారు. తెనాలి వ్యవహారం ఏంటని సూటిగా వైసీపీని ప్రశ్నించారు.
గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లను పరామర్శిస్తారా? ఈ విషయంలో ప్రజలు మీకు సపోర్టు చేయాలా? ఒంగోలు పొగాకు రైతుల వ్యవహారాన్ని గుర్తు చేశారు. నష్టం వచ్చినా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. బాధ్యత లేకుండా 15 వేల మందిని వెంటేసుకు పోయి రౌడీయిజం చేస్తారా? అమరావతి దేవతల రాజధాని, అది వేశ్యల నగరమా? అంటూ విరుచుకుపడ్డారు.
మీరెంత కొవ్వెక్కి ఉన్నారు? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. కొంతమంది విష ప్రచారం చేసి రౌడీయిజం చేసి పెత్తనం చేయాలని భావిస్తున్నారని అన్నారు. అలాంటి ఆటలు తన వద్ద సాగవన్నారు. ఇంతవరకు తన మంచితనం చూశారని ఇక ముందు తోక జాడిస్తే మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు. గుణపాఠం తప్పదని ఘాటుగా హెచ్చరించారు.
ALSO READ: జగన్ ఫ్యూచర్ ఇదే.. రఘురామరాజు షాకింగ్ కామెంట్స్
11 సీట్లతో ప్రజలు బుద్ది చెప్పినా బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారని రుసరుసలాడారు. తాము ఎలా వ్యవహరిస్తామో త్వరలో చూపిస్తామన్నారు. గంజాయ్ బ్యాచ్, అమరావతి వ్యవహారం, ఒంగోలు రౌడీయిజంపై తొలిసారి ఓపెన్‌గా మాట్లాడారు సీఎం చంద్రబాబు. తొలిసారి ఈ విధంగా స్పందించారలని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
పనిలో పనిగా కూటమి సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై వైసీపీ చేస్తున్న దుష్ఫచారాన్ని ఖండించారు సీఎం చంద్రబాబు. సూపర్ సిక్స్ హామీలపై క్లారిటీ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అమలు చేస్తున్నామని, శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదన్నారు.
ప్రజా రాజధాని అమరావతి వేశ్యల నగరమా?: చంద్రబాబు
అసభ్యకర వ్యాఖ్యలు చేసిందే కాకుండా పైగా సమర్థించుకుంటారా?
ప్రజల సంక్షేమమే ఎప్పుడూ నా ధ్యేయం
– సీఎం చంద్రబాబు pic.twitter.com/CxJkbPe9te
— BIG TV Breaking News (@bigtvtelugu) June 12, 2025
సూపర్ సిక్స్ హామీలపై సీఎం చంద్రబాబు క్లారిటీ
సూపర్ సిక్స్ హామీల అమలు ఖచ్చితంగా జరిగి తీరుతుందని తెలిపిన సీఎం చంద్రబాబు pic.twitter.com/O7VYKrqAxf
— BIG TV Breaking News (@bigtvtelugu) June 12, 2025