Holi Things: హోలికా దహన్ మార్చి 13న జరగనుంది. ఆ రోజు పెద్ద మంటలను వేస్తారు. అయితే ఆ మంటల్లో కొన్ని రకాల వస్తువులను దహనం చేయకూడదు. దీనివల్ల దురదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంటుంది.
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీని నిర్వహించుకుంటారు. దీన్ని రెండు రోజులపాటు చేసుకుంటారు. మొదటి రోజు హోలీకా దహన్ నిర్వహిస్తారు. ఇక రెండో రోజు రంగులు చల్లుకొని స్వీట్లు తినిపించుకుంటారు. హోలీకా దహన్ రోజు పెద్ద మంటలను వీధుల మధ్యలో వేస్తారు. ప్రతికూల శక్తిని కాల్చేసేందుకు ఇలా మంటలను ఏర్పాటు చేస్తారు. అయితే ఆ అగ్నిలో నాలుగు రకాల వస్తువులను మాత్రం వేయకూడదు. వాటిని వేస్తే దురదృష్టం మీ వెంటే వచ్చే అవకాశం ఉంది.
తెల్లని వస్తువులు
పండితులు చెబుతున్న ప్రకారం హోలికా దహన్ రోజు వేసిన అగ్నిలో తెల్లటి రంగులో ఉన్న ఏ వస్తువులను వేయకూడదు. ఆరోజు తెల్లటి వస్తువులను ఎవరికైనా ఇవ్వడం లేదా ఎవరి నుంచైనా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తి ప్రవహించే అవకాశం ఉంది. ఇది ఎన్నో ఇబ్బందులను గురిచేస్తుంది.
కొబ్బరికాయ
సనాతన ధర్మ పండితులు చెబుతున్న ప్రకారం పూజలో కొబ్బరికాయలు, కొబ్బరి బొండం వంటివి ఉంచుతూ ఉంటారు. అది ఏమాత్రం తప్పులేదు. కానీ పొరపాటున కూడా కొబ్బరి నీళ్లతో నిండిన కొబ్బరి బోండాన్ని లేదా కొబ్బరికాయను హోళికా దహన అగ్నిలో వేయకూడదు. ఇది చాలా అశుభం. ఆ కుటుంబం, ఆనందం శ్రేయస్సు పై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
గోధుమ కంకులు
గోధుమ కంకులు గ్రామాల్లోని ఇళ్లల్లో ఉండడం సహజమే. చాలామంది ఆ కంకులు ఎండిపోతే తీసుకొచ్చి హోలీ మంటల్లో పడేస్తూ ఉంటారు. హోలీకా దహన్ రోజు ఇలాంటి గోధుమ కంకులను వేయకూడదు. అలా వేస్తే ఇంట్లో సంపద, ధాన్యం నిల్వలు తగ్గిపోతాయని చెప్పుకుంటారు. ఆ కుటుంబం జీవనోపాధికి ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటారు.
Also Read: అరసవెల్లిలో స్వామిని తాకని సూర్యకిరణాలు.. కారణం ఇదే!
ధాన్యాలు
హోలీకి ముందు రోజు హోలికా దహనం అగ్నిలో గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలను వేస్తూ ఉంటారు. ఇది ఎంతో మంచి సంప్రదాయం. కానీ ఆ వేసే ధాన్యాల్లో గింజలు విరిగిపోకుండా పూర్తిగా ఉండేలా చూసుకోండి. విరిగిపోయిన ధాన్యాలను వేయడం వల్ల అశుభం కలుగుతుంది. దీని కారణంగా కుటుంబం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇంట్లో వారికి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన నాలుగు రకాల వస్తువులను హోలీ రోజు వేసే అగ్నిలో ఏమాత్రం సమర్పించకండి. ఇది కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే లెక్క.