Hari Hara Veera Mallu : అవును… ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులు ఇప్పుడు ఇలా హరి హర… అనుకుంటూ కూర్చోవడమే అవుతుంది. అప్పుడెప్పుడో 2020లో స్టార్ట్ అయినా ఈ మూవీ… ఇంకా రిలీజ్ కాలేదు. దాదాపుగా ఐదేండ్లు… షూటింగ్ జరుపుకుంటూనే…. ఉంది. వాయిదా పడుతూనే… ఉంది. ఈ మధ్యలో డైరెక్టర్ తప్పుకున్నాడు. కొత్త డైరెక్టర్ వచ్చాడు. నిర్మాతకు బడ్జెట్ తలకు మించిన భారం అవుతుంది.
ఏది ఏమైనా 28 మార్చి 2025న ఈ సినిమా తప్పక విడుదల అవుతుంది అంటూ అనౌన్స్ చేశారు. కానీ, ఇప్పటికీ ఈ మూవీకి చేయాల్సిన షూటింగ్ పార్ట్ చాలా ఉంది. దీంతో వాయిదా తప్పదు అనేలా పరిస్థితి ఉంది.
అయితేే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం… హరి హర వీరమల్లు సినిమా నిర్మాత ఎఎం రత్నం ఇక చేసింది చాలు… సినిమాను రిలీజ్ చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాడట. అయితే ముందుగా అనుకున్న డేట్ 28 మార్చి 2025 కి మాత్రం రిలీజ్ చేయడం కుదరదు. ఎందుకుంటే చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి.
అయితే మార్చి 28 కాకపోయినా… తర్వాత కాస్త ఎర్లీ గానే ఓ డేట్ ఫిక్స్ చేసుకుని, దాన్ని టార్గెట్ గా పెట్టుకుని పని చేయాలని, ఆ డేట్ కు పక్కాగా రిలీజ్ చేయాలని నిర్మాత రత్నం ఫిక్స్ అయ్యాడట. పనులు కూడా అలాగే సాగుతున్నాయని సమాచారం.
కొత్త విడుదల తేదీ…
అలా ఫిక్స్ అయిన డేట్… మే 09. ఎలాగైనా సమ్మర్ బరిలో నిలవాలని చూస్తున్నారట. దీనికి ఇంకా రెండు నెలల టైం ఉంది. ఈ రెండు నెలల్లో ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన పనులు అన్నీ పూర్తి చేయడం, లేదా… పూర్తి అయిన వరకు ఫస్ట్ పార్ట్ గా రిలీజ్ చేయడం ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారట.
అప్పులకు పెరిగిపోతున్న ఇంట్రెస్ట్…
హరి హర వీరమల్లు భారీ బడ్జెట్ మూవీ. అందులోనూ… దాదాపుగా 5 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న… మూవీ. అంటే అర్థం చేసుకొవచ్చు ఈ మూవీ బడ్జెట్ ఎంత పెరిగిఉంటుందో…
సినిమా కోసం వేసిన సెట్స్ కే ఎక్కువ బడ్జెట్ అయ్యే పరిస్థితి ఉంది. ముందుగా ఈ మూవీకి 200 కోట్లు అనుకున్నారు. కానీ, ఫస్ట్ పార్ట్ కే 200 కోట్లు ఎప్పుడో దాటిపోయిందట. ఇక సెకండ్ పార్ట్ అలాగే ఫస్ట్ పార్ట్ లో పూర్తి చేయాల్సి ఉంది. అలా… హరి హర వీరమల్లు బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది.
ఫైనాన్సియర్స్ నుంచి ఒత్తిడి..?
ఫైనాన్సియర్స్ నుంచి కూడా నిర్మాత రత్నంకు ఒత్తిడి వస్తుందని సమాచారం. 5 ఏళ్లు అవుతుంది కాబట్టి… ఆ మాత్రం ప్రెషర్ ఉంటుంది. అందుకే.. మొదటి పార్ట్ ను వీలైనంత స్పీడ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారట…
మరి పవన్ సహకారం…
నిర్మాత రత్నం అనుకోవడం బాగానే ఉంది… కొత్త రిలీజ్ డేట్ కూడా బానే ఉంది. కానీ, దానికి పవన్ సహకారం కూడా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితిల్లో ఏపీ డిప్యూటీ సీఎం బయటికి వచ్చి… సినిమా షూటింగ్ లోకేషన్స్ లో ఉండగలడా..? అనేదే చూడాలి.