Herbs For Hair: మన జుట్టు ఆరోగ్యం గురించి మనం తరచుగా ఆందోళన చెందుతుంటాము. కాలుష్యం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు ,హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల వల్ల, జుట్టు రాలడం, సన్నబడటం,తెల్లగా మారడం వంటివి సాధారణ సమస్యలుగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో.. చాలా మంది దృష్టి సహజ, ఆయుర్వేద పదార్థాలపై పడుతుంది. శతాబ్దాలుగా ఆయుర్వేద మూలికలు జుట్టు సంరక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ఇవి జుట్టును పోషించడమే కాకుండా.. దాని మూలాలను కూడా బలోపేతం చేస్తాయి.
ఈ రోజు మనం జుట్టును ఆరోగ్యంగా ఉంచే 5 ప్రభావవంతమైన జుట్టు పెరుగుదల సహజ పదార్థాలను గురించి తెలుసుకుందాం . ఈ మూలికలు మీ జుట్టును సహజంగా బలంగా, మందంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ మూలికలను నూనె, పేస్ట్ లేదా మాస్క్ వంటి వివిధ రూపాల్లో కూడా జుట్టుకు ఉపయోగించవచ్చు. వీటిని సరిగ్గా ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యల నుండి బయటపడవచ్చు. అంతే కాకుండా సహజంగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
భ్రింగరాజ్ (గుంటగలగర ఆకు):
జుట్టుకు రాజు – ఆయుర్వేదంలో భ్రింగరాజ్‌ను “కేశరాజ్” అని పిలుస్తారు. ఇది జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని నివారించడానికి, అంతే కాకుండా జుట్టు తెల్లబడటం ప్రక్రియను నెమ్మదిస్తుంది. కొబ్బరి లేదా నువ్వుల నూనెలో భ్రింగరాజ్ ఆకులను మరిగించి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి. దీంతో పాటు, పెరుగు లేదా కలబంద జెల్ కలిపిన భ్రింగరాజ్ పొడిని జుట్టుకు మాస్క్ లాగా ఉపయోగించడం వల్ల కూడా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
ఉసిరి:
జుట్టుకు సహజ విటమిన్ సి – ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలువబడే ఉసిరిలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉసిరి నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు మందంగా మెరిసేలాతయారవుతుంది. అలాగే ఉసిరి పొడిని మందార పొడితో కలిపి నీరు లేదా పెరుగుతో పేస్ట్ లా చేసి జుట్టుకు అప్లై చేయండి. 20-30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి 2 సార్లు చేయండి.
బ్రాహ్మి:
మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం- బ్రాహ్మి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, జుట్టు మూలాలను కూడా పోషిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో, పెరుగుదలను అందించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో బ్రాహ్మి ఆకులను మరిగించి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటు.. బ్రాహ్మి పొడిని పెరుగు, వేప ఆకులతో కలిపి జుట్టుకు అప్లై చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
నాగర్మోత:
జిడ్డుగల తలకు ఒక వరం – నాగర్మోతను ముస్తా అని కూడా పిలుస్తారు. ఇది జిడ్డుగల తలపై చర్మాన్ని సమతుల్యం చేయడానికి, తలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా తలపై దురద వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది. నాగర్మోత పొడిని నీటిలో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Also Read: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది తెలుసా ?
స్పైకెనార్డ్:
బట్టతలకి ప్రభావవంతంగా ఉంటుంది- జుట్టుకు ఒక వరంలా భావించే స్పైకెనార్డ్, బట్టతల సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా కొత్త పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. స్పైకెనార్డ్ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటు.. కొబ్బరి నూనెతో స్పైకెనార్డ్ పొడిని కలిపి జుట్టుకు అప్లై చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ ఐదు మూలికలను క్రమం తప్పకుండా , సరిగ్గా ఉపయోగించడం ద్వారా.. మీరు మీ జుట్టును సహజంగా ఆరోగ్యంగా, బలంగా మార్చుకోవచ్చు.