Guru Margi 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వసంత పంచమిని మాఘ మాసంలోని శుక్ల పంచమి ఐదవ రోజున జరుపుకుంటారు. వసంత పంచమి ఫిబ్రవరి 02. 2025న జరుపుకోనున్నాము. ఈ రోజునే సరస్వతి పుట్టిందని నమ్ముతారు. అందుకే ఈ రోజున సరస్వతిని పూజించడం వల్ల ఆనందం , అదృష్టం పెరుగుతాయని చెబుతారు . ఈ ఏడాది కుంభ మేళా కూడా జరగడం వల్ల వసంత పంచమికి మరింత ప్రాధాన్యత పెరిగింది.
వసంత పంచమి రోజున మహా కుంభ మేళా మూడవ స్నానం అమృత స్నానం చేస్తారు. ఆ తర్వాత సరిగ్గా రెండు రోజులకు అంటే ఫిబ్రవరి 4 న మధ్యాహ్నం 1.46 గంటలకు మిథున రాశిలోకి గురుడు ప్రవేశించనున్నాడు. దీని కారణగా కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, ప్రేమ జీవితం వంటి వాటిలో మెరుగుదల ఉంటుంది. గురుడి సంచారం 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతుంది. కానీ ముఖ్యంగా 3 రాశుల వారిపై గురుడి సంచార ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి గురుడి సంచారం అద్భత ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా ఈ సంచారం మీకు చాలా మేలు చేస్తుంది. మీ ఆఫీసుల్లో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. అంతే కాకుండా మీరు కొత్త అవకాశాలను కూడా అందుకునే మార్గాలు ఉన్నాయి. అవివాహితులకు వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీరు లాభాలు గడిస్తారు. కోర్టులో ఏదైనా కేసు ఉంటే దాని నుండి మీరు ఉపశమనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. గురుడి సంచారం వల్ల మీ సంబంధాలు బలపడతాయి.
సింహ రాశి:
గురుడి సంచారం మీ జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. అంతే కాకుండా మీరు వ్యాపారంలో లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహనం కొనాలని అనుకునే వారి కల నిజం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కుటుంబ పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు పదవులు, ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ ఆనందానికి అవధులు ఉండవు. మీరు అనుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది. ఒంటరి వ్యక్తుల జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. మీ ఆత్మ విశ్వాసం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసే పుట్టుమచ్చలు ఎక్కడుంటాయో తెలుసా..?
కన్యా రాశి :
కన్యా రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. బృహస్పతి యొక్క శుభ ప్రభావం వల్ల మీకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు మీ అత్తమామల నుండి ఖరీదైన బహుమతిని కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫ్లాట్ కొనడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడిలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.