SSMB 29 .. టాలీవుడ్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు (Mahesh Babu) ఇప్పటివరకు వేరే భాషా చిత్రంలో నటించకుండా.. టాలీవుడ్కే పరిమితమయ్యారు. కానీ తన సినిమాలతో పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్న ఈయన.. ఇప్పుడు పాన్ వరల్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Maheshbabu) హీరోగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29).
ప్రస్తుతం ఇదే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్, ఒడిస్సా లోని పలు ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరగగా.. ఇప్పుడు మే నెల నుంచి మరో ప్రాంతంలో షూటింగ్ జరగబోతున్నట్లు సమాచారం.
ఎస్ ఎస్ ఎం బి 29 నుంచి ఊహించని అప్డేట్..
ఇదిలా ఉండగా ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఈయన విలన్ గా నటిస్తున్నారని, మహేష్ బాబుకు ధీటుగా పృథ్వీరాజ్ పోటీ పడడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో మెయిన్ విలన్ కాదు అంటూ సడన్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ వార్త విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదెక్కడి ట్విస్ట్ మావా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కాదని, అసలైన విలన్ ఇంటర్నేషనల్ డాన్ అని తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ALSO READ ;Samantha: పేరు పెట్టలేనిదే మా బంధం.. ఎట్టకేలకు ఓపెన్ అయిన సమంత..!
మహేష్ తో తలపడే మెయిన్ విలన్ పృథ్వీరాజ్ కాదా..
దర్శక ధీరుడు రాజమౌళి మునుపటి చిత్రాల లాగా కాకుండా ఈ సినిమాను చాలా పగడ్బందీగా ఒక్కో అంశాన్ని దశలవారీగా రివీల్ చేస్తూ ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఒడిశా లో జరిగిన షెడ్యూల్లో కూడా ఆయన పాల్గొన్నారు. పైగా ఈ విజువల్స్ అనుకోకుండా వైరల్ అవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవేంటంటే ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారా..? ఇంకెవరైనా ఉన్నారా? అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రశ్న. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మెయిన్ విలన్ పృథ్విరాజ్ కాదట. మహేష్ బాబుతో తలపడే అసలు విలన్ ఒక నల్ల జాతీయుడని, పైగా అతడు పలు హాలీవుడ్ చిత్రాలలో కీలకపాత్రలు కూడా పోషించారని సమాచారం. త్వరలో ఆయన పేరును రాజమౌళి స్వయంగా రివీల్ చేస్తారని కూడా తెలుస్తోంది. అటు ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ కావడంతో విలన్ గా నల్లజాతీయుడు ఉంటేనే కరెక్ట్ అని రాజమౌళి కూడా భావించారట. ఇకపోతే ఇలా పాత్రకు తగ్గట్టుగా క్యారెక్టర్ ను డిజైన్ చేయడం రాజమౌళికి ఇదేమి మొదటిసారి కాదు. గతంలో ‘బాహుబలి’ లో ‘కాలకేయుడు’, ‘విక్రమార్కుడు’లో ‘టిట్లా’ పాత్రలు ఎంత పాపులర్ అయ్యాయో అంతకుమించి ఈ పాత్ర ఉంటుందని ఇన్సైడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియనున్నాయి అని సమాచారం.