Rahu Shukra Yuti 2025: షాడో గ్రహం రాహువు ప్రస్తుతం ఉత్తరాభాద్రపద నక్షత్రంలో ఉన్నాడు. రాక్షస గురువు శుక్రుడు కూడా ఈ రాశికి ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8.37 గంటలకు రానున్నారు. అయితే అంతకు ముందే జనవరి 28న మీనరాశిలో రాహువు, శుక్రుడు కలయిక జరగనుంది.
ఈ అరుదైన కలయికల వల్ల 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా 3 రాశుల వారు లాభాలను పొందుతారు. అంతే కాకుండా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.మరి ఏ యే రాశుల వారికి రాహువు, శుక్రుడి కలయిక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆ రాశుల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి:
రాహువు, శుక్రుడి సంచారం మకర రాశి వారికి అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. ఫలితంగా జనవరి 28 నుండి మీ జీవితంలో అనేక మార్పులు కలుగుతాయి. నూతన పనులు ప్రారంభించడానికి ఇది మీకు మంచి సమయం. అంతే కాకుండా ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. మీ జాతకంలో మూడవ ఇంట్లో రాహు-శుక్ర కలయిక ఏర్పడుతుంది. ఈ ప్రభావంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. అలాగే, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కొన్ని ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. ఆస్థి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పెరుగుదల చాలా మెరుగ్గా ఉంటుంది.
వృషభరాశి:
వృషభ రాశి వారికి రాహు శుక్రుల కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వ్యక్తులు స్నేహితులతో సరదాగా గడపే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా . మీరు మీ ఆఫీసుల్లో మీ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలకు అందుకుంటారు. మీరు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ యొక్క ప్రయోజనం పొందుతారు. చట్టపరమైన విషయాల ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఆర్థిక పరంగా మీరు లాభాలపను పొందుతారు. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారు.
Also Read: మహిళా నాగసాధువులు ఎక్కడ ఉంటారు ? వీరి గురించి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు !
మేష రాశి:
శుక్రుడు మీ రాశిలోని పన్నెండవ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. అదే ఇంట్లో రాహువుతో సంయోగం ఉంటుంది. మీ వివాహానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొనసాగుతున్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దూరం ప్రయాణించవలసి వస్తుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు కూడా పొందుతారు. సంతోషకరమైన జీవితాన్ని కూడా మీరు గడిపేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి.