NZ vs ENG: న్యూజిలాండ్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ {NZ vs ENG} లో న్యూజిలాండ్ కి కలిసి రావడం లేదు. ఈ సిరీస్ లో ఇప్పటికే జరిగిన రెండు టెస్టుల్లో కివీస్ రెండింటిలోనూ ఓడిపోయింది. ఇక మూడో టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన {NZ vs ENG} రెండవ టెస్టులో ఇంగ్లాండ్ 323 పరుగుల తేడాతో గెలుపొందింది. 16 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ లో టెస్ట్ సిరీస్ ని కైవసం చేసుకుంది.
Also Read: IND vs AUS: మళ్లీ అదే తప్పు.. నీకు బ్యాటింగ్ చేతకాదంటూ కోహ్లీపై గవాస్కర్ సీరియస్
రెండవ టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయంలో హ్యారీ బ్రూక్, గుస్ అట్కిన్సన్ కీలకపాత్ర పోషించారు. ఇక మూడవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనుకోని రీతిలో అవుట్ అయ్యాడు. డిఫెన్స్ ఆడిన బంతిని అనవసరంగా టచ్ చేసి బోల్డ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. మొదటి రెండు టెస్టుల్లో ఓడిపోయిన న్యూజిలాండ్ మూడో టెస్ట్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.
ఈ క్రమంలోనే రెండవ {NZ vs ENG} ఇన్నింగ్స్ లో సెంచరీ తో అదరగొట్టాడు కేన్ మామ. 204 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్ తో 156 పరుగులు చేశాడు. దీంతో హమిల్టన్ వేదికగా విలియమ్ సన్ కి ఇది వరుసగా ఐదో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీ తో కేన్ మామ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే వేదికపై టెస్టుల్లో వరసగా ఐదు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పటివరకు విలియమ్ సన్ టెస్టుల్లో 33 సెంచరీలు చేశాడు.
2019వ సంవత్సరంలో బంగ్లాదేశ్ పై ద్విశతకం నమోదు చేసిన విలియమ్ సన్.. అదే ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన తర్వాత మ్యాచ్ లో 104 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2020లో వెస్టిండీస్ పై 251 పరుగులు, 2024 లో సౌతాఫ్రికా పై 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఒకే వేదికపై అత్యధిక టెస్ట్ యావరేజ్ కలిగిన బ్యాటర్ల జాబితాలోనూ విలియమ్ సన్ 5 వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ లో డాన్ బ్రాడ్మన్, వివిఎస్ లక్ష్మణ్, గర్ఫిల్డ్ సోబెర్స్, జహీర్ అబ్బాస్.. కేన్ మామ కంటే ముందున్నారు.
Also Read: Bumrah: బుమ్రాకు ఘోర అవమానం.. కోతి జాతి అంటూ మహిళా కామెంటేటర్ కామెంట్స్!
ఈ మూడవ టెస్ట్ {NZ vs ENG} రెండో ఇన్నింగ్స్ లో రాణించిన కేన్ కి హామిల్టన్ క్రౌడ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఈ మూడవ టెస్ట్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 347 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్ జట్టుకి 204 పరుగుల ఆదిత్యం దక్కింది. భారీ ఇన్నింగ్స్ తో రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కివీస్ 101 ఓవర్లలో 453 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఈ చివరి టెస్ట్ లో న్యూజిలాండ్ గెలిచినప్పటికీ ఆ జట్టుకి ఫలితం దక్కదు.