Vishwak Sen’s Mechanic Rocky : హీరో విశ్వక్ సేన్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ నిన్న (ఆదివారం) ట్రైలర్ 2.0 లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో విశ్కక్ సేన్ ఎలా మాట్లాడారో అందరూ చూశారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ మెకానిక్ రాకీ మూవీకి ప్రమోషన్స్ కూడా చేయలేను అని చెప్పాడట ఈ హీరో. ప్రమోషన్స్‌కు సంబంధించి ఒక్క ఈవెంట్‌లోనూ పాల్గొనే ఛాన్సే లేదు అని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెప్పారట. విశ్వక్ ఎందుకు ప్రమోషన్స్‌లో పాల్గొనను అని చెప్పాడు.? ఇప్పుడు ఎందుకు పాల్గొంటున్నాడు? ఇంతలా ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు? అనేది ఇప్పుడు చూద్ధాం…
గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి మిక్సిడ్ టాక్ మూవీస్ చేసిన తర్వాత విశ్వక్ సేన్ ఓ హిట్ మూవీ చేయాలని అనుకున్నాడు. అందుకు అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ స్టోరీని ఎంచుకున్నాడు. అలా వచ్చిందే ఈ మెకానిక్ రాకీ. విశ్వక్ సేన్ నుంచి ఈ ఏడాది వస్తున్న మూడో సినిమా ఈ మెకానిక్ రాకీ. కొత్త డైరెక్టర్ అయినా… యాక్షన్ / కామెడీతో ఉన్న కథ నచ్చడంతో విశ్వక్ వెంటనే మూవీకి ఒకే చేశాడు. సినిమా కూడా పూర్తి అయింది.
అయితే, ఇటీవల మూవీ టీం ఫైనల్ అవుట్ పుట్ చేసిందట. అందరితో పాటు ఈ సినిమాను చూసిన విశ్వక్ సేన్‌కు అసలు నచ్చలేదట. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒక్క హిట్ కూడా లేదు. ఇప్పుడు రాబోయే మూవీ కూడా అలానే ఉంటే కష్టమని అనుకున్నాడట. అందుకే మెకానిక్ రాకీ మూవీ ప్రమోషన్స్ రాలేనని నిర్మాతలు SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెప్పారట. దీంతో నిర్మాతలకు, హీరోకు మధ్య చిన్న వివాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది.
అయితేే, తాను ప్రమోషన్స్ రావాలంటే, రెమ్యునరేషన్‌ను పెంచాలని డిమాండ్ చేశాడు అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. రెమ్యునరేషన్ పెంచితేనే ప్రమోషన్స్ కు వస్తా అని చెప్పడంతో SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసేదేమీ లేక, హీరో చెప్పినట్టు చేశారట.
అందుకే ఇప్పుడు విశ్వక్ సేన్ ప్రమోషన్స్‌కు వస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే, ఈ సినిమాకు ఎలాగైన మంచి ఓపెనింగ్స్ అయినా తీసుకొచ్చేలా చేయాలని చూస్తున్నారట. అందుకే, అన్ని మూవీస్‌కి చేసినట్టు ఈ మూవీకి కూడా విశ్వక్ కాంట్రవర్సీ వర్డ్స్ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఎంత చేసినా సినిమా హిట్ అయితేనే హీరో విశ్వక్ సేన్ పరువు నిలబడినట్టు అవుతుంది. లేకపోతే, కష్టమే. ఈ నవంబర్ 22న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ విశ్వక్ పరువు నిలబెడుతుందా…? లేకపోతే, ఈ ఏడాదిని మూడు సినిమాలు చేసినా… ఒక్క హిట్ లేకుండానే ముగించేస్తాడా..? చూడాలి మరి.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. కొన్ని రోజుల క్రితం ట్రైలర్ 1.0 లాంచ్ ఈవెంట్‌లో బజ్ క్రియేట్ అవ్వలేదు. బజ్ క్రియేట్ అవ్వలేదు అని అంటున్నారు. బజ్ నేనే ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నా.. బజ్. ఇక నుంచి బజ్ లేదు అన్నోడిక ఇద్దం మనం బజ్ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ చేసి మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా సినిమాపై బజ్ లేదు అనేది నిజం. ఆది వారం ట్రైలర్ 2.0 లాంచ్ ఈవెంట్ తర్వాత కూడా సినిమాపై బజ్ క్రియేట్ అయిందా.. అంటే అదీ లేదు అని చెప్పాలి. విశ్వక్ మాటలకు కాస్త ఫోకస్ అయితే అయింది కానీ, సినిమాకు అది ప్లస్ అవ్వలేదు.