Narada Muni : నారదుడికి ఒక లవ్‌స్టోరీ ఉంది. అది అటాంటి ఇటాంటి లవ్ స్టోరీ కాదు. తను లవ్ చేసిన ప్రేయసి కోసం ఏకంగా జీవితాన్నే త్యాగం చేసిన ప్రేమకథ. తెలుసుకున్నోళ్లు కూడా నోరెళ్లబెట్టేంత లవ్‌స్టోరీ. లైలా మజ్ను లను మించిన కాదల్ కథ. పారు దేవదాసుల కన్నా పవిత్రమైన ప్రేమకథ. అసలు నారదుడికి లవ్ స్టోరీ ఏంటి అనుకుంటున్నారు కదా అయితే ఆయన ప్రేమ కహానీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నారదుడు తెలుగు సినిమాలలో కామెడీని పండించిన పాత్రగానే చాలా మందికి తెలుసు. ఎందుకంటే మన సినిమా రైటర్లు, డైరెక్టర్లు అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ నారదుడిని సినిమాల్లో హాస్యం వరకే పరిమితం చేశారు తప్పా ఆయన జీవింతలోని అసలైన కోణాన్ని.. నిజమైన ఘట్టాలను వెండితెర మీద ఆవిష్కరించలేకపోయారు. కానీ ఆయనొక గొప్ప మహర్షి.. లోక కళ్యాణం కోసం ఆయన ఎన్నో సత్ కార్యాలు చేశాడన్న విషయం ఏ కొద్ది మందికో తెలుసు. రాక్షసుల నుంచి దేవతలను కాపాడినా.. దేవుడి చేత రాక్షసులను చంపించినా నారద మహర్షికే సాధ్యం అయింది. అసురులను ఏమార్చడంలోనూ.. వారి దృష్టి మరల్చి వారి నాశనానికి వారే కారణం అయ్యేలా చేయడంలోనూ ఎంతో ఘనమైన నేర్పరి నారదుడు. అన్నింటికీ మించి ఆయనొక అద్బుతమైన దూత. సంధి నెరపడంలోనూ.. సయోధ్య కుదర్చడంలోనూ నారదుడిని మించిన వాగ్దాటి లేడంటే అతిశయోక్తి లేదు. అంతటి నారద మహర్షి కూడా భగ్న ప్రేమికుడన్న విషయం ఎంత మందికి తెలుసు. తను ప్రేమించిన ప్రేయసి కోసం శాపాలను సైతం స్వాగతించాడు.. ఇచ్చిన మాట తప్పాడన్న అపవాదును మూటగట్టుకున్న స్వచ్చమైన ప్రేమికుడు నారద మహర్షి.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు
నారద మహర్షి తన మేనల్లుడైన తుంబురుడితో కలిసి ఒక సందర్భంలో భూలోకం వస్తాడు. అయితే ఇద్దరూ కలిసి ఒక నియమం పెట్టుకుంటారు. భూలోకంలో ఉన్నన్ని రోజులు తమ మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని… తమకు ఎదురైన ఎటువంటి విషయాలైనా ఒకరికొకరు చెప్పుకోవాలని అనుకుంటారట. ఆ నియమానుసారం ఇద్దరూ కలిసి సుంజయుడు అనే రాజు ఇంట్లో బస చేస్తుంటారు. ఆ రాజు కూతురు సుకుమారి తుంబుర, నారదులకు సేవలు చేస్తుంది. సుకుమారి సేవలకు పొంగి పోయిన నారదుడు ఆమెను ప్రేమిస్తాడు. తన మనసులో మాట కూడా సుకుమారికి చెప్తాడు. ఆమె కూడా సంతోషంగా నారదుల వారి ప్రేమకు అంగీకారం తెలుసుతుందట. అయితే నియమం ప్రకారం నారదుడు తన ప్రేమ విషయం తుంబురుడికి చెప్పడు నారదుడు.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?
కానీ ఎలాగో నారదుడి ప్రేమ విషయం తెలుసుకున్న తుంబురుడు కోపంగా నారదుడిని తిట్టి.. మన నియమం అతిక్రమించావు నువ్వు కాబట్టి నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే.. నీ ముఖం కోతి ముఖంలా మారిపోతుంది. ఇది నా శాపం అంటూ తుంబురుడు శాపం పెడతాడట. తుంబురుడు శాపం పెట్టినా.. నారదుడు సంతోషంగా స్వాగతించి.. అయినా నేను సుకుమారిని పెళ్లి చేసుకుంటానని.. నేను మనసారా ప్రేమించిన అమ్మాయిని మాత్రం వదులుకోనని చెప్తాడట నారదుడు. చెప్పినట్టుగానే.. నారదుడు సుకుమారిని పెళ్లి చేసుకుంటాడు. వెంటనే నారదుడి ముఖం కోతి ముఖంలా మారిపోతుంది. కోతిలా మారిపోయినా నారదుడిపై ప్రేమను చంపుకోలేక సుకుమారి నారదుడితో వెళ్లిపోతుందట.
అయితే తన ప్రేమ విషయంలో సొంత వాళ్లను కూడా దూరం చేసుకున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో కదా. ఇక తనకు శాపం ఇచ్చిన తుంబురుడికి నారదుడు ఒక శాపం ఇచ్చాడట. తనను కోతిలా మార్చిన తుంబురుడికి స్వర్గలోక ప్రవేశం నిషిద్దం అంటూ శపించడంతో తుంబురుడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడట. తర్వాత కొన్ని సంవత్సరాలకు కలుసుకున్న తుంబురుడు, నారదడు తమ తమ శాపాలను ఉప సంహరించుకున్నారట.
ALSO READ: 2025 లో విపరీతమైన ధనయోగం పట్టబోయే ఐదు రాశులు ఇవే – అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి