Pancha Graha Kutami 2024: తరచూ ఆకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అంతరిక్షం నుంచి మొదలుకుని గ్రహాలు, నక్షత్రాలు వంటివి అద్భుతాలను సృష్టిస్తూనే ఉంటాయి. చంద్రగ్రహణం, సూర్య గ్రహణం వంటి ఎన్నో అత్యంత అద్భుతాలను తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని సార్లు 100 ఏళ్లకు, 25 ఏళ్లకు అచ్చే గ్రహణాలు కూడా ఉంటాయి. ఇలా ఎన్ని విన్నా కూడా ఒక దారి పేరు వింటే మాత్రం అందరికీ ఆతృతగా అనిపిస్తుంది. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి ఆకాశంలో అద్భుతం జరుగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అయితే చాలా మంది ఈ పేరు వింటారు తప్పా అసలు పంచగ్రహ కూటమి అంటే ఏంటో తెలిసి ఉండదు. మరి పంచగ్రహ కూటమి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పంచగ్రహ కూటమి అంటే ఏమిటి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరో నాలుగు రాజుల్లో అంటే జూన్ 5వ తేదీన ఆకాశంలో అద్భుతం జరగనుంది. అదే పంచగ్రహం కూటమి. పంచగ్రహ కూటమి అంటే ఒకేసారి 5 గ్రహాలు ఒకే వరుసలో ప్రత్యక్షమవుతాయి. దీనినే పంచగ్రహ కూటమి అంటారు. ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతమైన సంఘటన అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పంచగ్రహ కూటమిలో బుధుడు, శక్రుడు, సూర్యుడు, చంద్రుడు, గురుడు కలిసి ఏర్పరుస్తారు. ఈ గ్రహాలన్ని మిథున రాశిలో కలుస్తాయి. దీని వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. అయితే ఈ గ్రహాల కూటమి వల్ల మొత్తం 12 రాశులపై ప్రభావం ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఇది శుభపరిణామాలు సూచిస్తే.. మరి కొన్ని రాశులకు మాత్రం అశుభాలే జరుగుతాయి. అందువల్ల కూటమి సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..
పంచగ్రహ కూటమి ఏర్పడే సమయంలో నీరు ఎక్కువగా తాగాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
కూటమి ఏర్పడే రోజున కోపం, అహంకారం వంటి భావాలకు దూరంగా ఉంటే మంచిది.
గొడవలు, కొట్లాటలు వంటి వాటికి దూరంగా ఉండాలి.
పంచగ్రహ కూటమి నాడు దానధర్మాలు చేస్తే మంచిది.