BigTV English

Kamal Haasan – Indian 2: ఇవాళే ఆడియో లాంచ్.. స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న మూవీ టీం..

Kamal Haasan – Indian 2: ఇవాళే ఆడియో లాంచ్.. స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న మూవీ టీం..

Indian 2 Grand Audio Launch Today(Cinema news in telugu): విలక్షణ నటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో మళ్లీ కంబ్యాక్ అయ్యాడు. అప్పటి వరకు వరుస ఫ్లాప్‌లతో ఎంతో సతమతమైన విక్రమ్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఇందులో భాగంగానే ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు శంకర్‌తో ‘ఇండియన్ 2’ మూవీ చేస్తున్నాడు. గతంలో అంటే 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అంటే దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఈ సీక్వెల్ మూవీని దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈ ‘ఇండియన్ 2’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్‌తో పాటు నటుడు సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, ప్రియా భవాని శంకర్ వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

వీరితో పాటు ఎస్.జె సూర్య, బాబీ సింహ వంటి స్టార్ నటులు కూడా ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పట్టాలెక్కి దాదాపు రెండు మూడేళ్లు అయింది. అయినా ఇంకా రిలీజ్‌కు నోచుకోలేదు. దీనికి కూడా ఓ కారణం ఉంది. దర్శకుడు శంకర్ ఓ వైపు ‘ఇండియన్2’ చేస్తూనే మరోవైపు రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ ను పట్టాలెక్కించాడు. అందువల్ల ఈ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేయడంతో ఇంత లేట్ అయింది.


Also Read: దర్శకుడు శంకర్ ప్లాన్ అదుర్స్.. ‘ఇండియన్ 2’ కోసం తరలి వస్తున్న సౌత్ స్టార్ హీరోలు?

ఇక ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో ఇప్పుడు మూవీ యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని జూన్ 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల తెలిపారు. దీంతో ఇప్పుడు ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే మూవీ ఆడియో లాంచ్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ‘ఇండియన్ 2’ మూవీ ఆడియో లాంచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరగనుందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకర్స్ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కమల్ హాసన్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంతేకాకుండా ఈ లాంచ్ ఈవెంట్‌లో మూవీ యూనిట్ మంచి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×