Garuda Puranam: గరుడ పురాణం.. ఆ పేరు ఎత్తగానే చాలామంది భయపడు తుంటారు. తప్పులు చేసిన మానవులకు శిక్షలు ఘోరంగా ఉంటాయని చాలా మంది చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆ మధ్య తెలుగులో ‘అపరిచితుడు’ సినిమా కూడా వచ్చింది. అందులోనూ అదే చూపించాడు డైరెక్టర్ శంకర్. చేసిన తప్పుల గురించి మాత్రమే. కేవలం 10 అంశాలు పాటిస్తే మానవుల జీవితంగా హ్యాపీగా ఉంటుంది. అవేమీ కొనాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇప్పుడున్న మానవ జీవితంలో కాసింత కష్టంగానే ఉంటుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం.
సత్యమే విజయం.. గరుడ పురాణంలో మొదటి పాఠం సత్యం ప్రాముఖ్యతను తెలుపుతుంది. సత్యం చెప్పడం ద్వారా అనేక సమస్యలను మనం సులభంగా పరిష్కరించవచ్చు. ఎల్లప్పుడు దాన్ని ఫాలో కావాల్సిందే. అదే మనల్ని కష్టాల నుండి రక్షిస్తుంది కూడా. సత్యం అనేది అంతర్గత శాంతి, సంపూర్ణతకు ఒక శక్తివంతమైన మంత్రం లాంటిది. ఇప్పుడున్న రోజుల్లో జరుగుతుందా?
కర్మ ఫలం.. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంది. మంచి కర్మలు చేస్తే రిజెల్ట్స్ బాగా వస్తాయి. అదే విధంగా చెడు కర్మలు చేస్తే దాని ఫలితాలు ఆ రేంజ్‌లో ఉంటాయి. అందువల్ల మనం మంచి పనులు చేయాలి. అలాగే ఇతరులకు సహాయం, దయగల హృదయంతో ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాము.
ధనాన్ని సద్వినియోగం.. దీనికి సరైన మార్గ దర్శకత్వం చేస్తుంది గరుడ పురాణం. సంపాదన అనగా వచ్చిన డబ్బును పవిత్రమైన శుభ కార్యాలకు మాత్రమే ఉపయోగించాలి. రియల్ లైఫ్‌లో చాలామంది ధనవంతులు లేదా బిలియనీర్లు మంచి పనుల కోసం వినియోగిస్తారు. అలా చేస్తే జీవితం సుఖంగా ఉంటుంది. మంచి చేశామన్న ఫీల్ ఉంటుంది. స్వార్థ పూరితమైన ఆలోచనలు అస్సలు ఉండరాదు. నిస్వార్థమైన ఉద్దేశ్యాలతో ఖర్చు చేస్తే ఫలితం వస్తుంది. డబ్బు అనేది తొలుత మనం సంపాదించాలి. ఆ తర్వాత దానికంటే రెట్టింపు అవుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ALSO READ: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి
కుటుంబం-సంబంధాల ప్రాముఖ్యత. మనకు కుటుంబం, స్నేహితులు, ఇతరులు ఉన్నంత కాలం జీవితం సంతోషంగా ఉంటుంది. వారిని ప్రేమించడం, గౌరవించడం, వారికి కృతజ్ఞతలు తెలపడం ద్వారా మన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు.
ఆరోగ్యం ప్రాణధారం.. ఆరోగ్యం లేకుండా ఆనందంగా జీవించడం కష్టమైన పని. సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. వీటి వల్ల మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం మన శక్తిని పెంచడంతో మనం కూడా హ్యాపీగా ఉంటాము.
కర్మ- భక్తి.. కేవలం కర్మలు చేయడం మాత్రమే కాదు ఆధ్యాత్మిక భక్తి ముఖ్యమని చెబుతోంది గరుడ పురాణం. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఉండాలి. అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.
ఆత్మ శుద్ధి.. ఆత్మలో స్వచ్ఛత చాలా అవసరం. వచ్చే ఆలోచనలు, చేసే పనులు స్వచ్ఛంగా ఉండాలి. ఆత్మను శుద్ధి చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. దీనివల్ల మన శాంతి ఉంటుంది. ఆనందంతోపాటు మంచి లక్షణాలు వస్తాయి.
సంయమనం మానవుల జీవితంలో చాలా ముఖ్యం. తపస్సు-సంయమనం.. ఈ రెండూ ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన లక్షణాలుగా చెబుతారు. మనస్సు, శరీరం, ఆత్మను శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. సంయమనం లేకుండా స్వార్థపూరితమైన కోరికలను తొలగించడం కష్టమని చెప్పవచ్చు.
మాయ నుంచి బయటపడడం. భౌతిక ప్రపంచంలో మాయ మనల్ని బంధిస్తుంది. కేవలం ధ్యానం, పూజ, ఆధ్యాత్మిక మార్గాల ద్వారా దీని నుంచి విముక్తి పొందగలమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
మరణం-జీవితం.. మనం చేసిన కర్మల ఆధారంగా మరణం ఉంటుంది. దాని తర్వాత మనం ఎక్కడాలో నిర్ణయిస్తుంది. ఎలా జీవించాలో జాగ్రత్తగా ఆలోచించడం చాలా ముఖ్యం. జ్ఞానం మనకు జీవితంలో సరైన దిశలో నడవడానికి మార్గనిర్దేశం చేస్తుంది కూడా. మన జీవితంలో సత్యం, కర్మలు, భక్తి, ప్రేమ, ఆరోగ్యం, సంయమనం, ఆత్మ, జ్ఞానం వంటి ఆచరించాలి. అప్పుడే జీవితం సుఖం, సంతోషంగా ఉంటుంది.