Banana Leaf: పురాతన కాలం నుంచి అరటి ఆకులను వివిధ ఆచారాలు, వేడుకలు, రోజువారీ ఆహారంలో మనోళ్లు ఉపయోగిస్తున్నారు. మన సంస్కృతి ఆరోగ్యకరమైన జీవనశైలి. అరటి ఆకులో భోజనం తినడం అమృతంతో సమానమని నమ్ముతారు. ఇందులో ఉండే అనేక పోషకాలు ఆహార రుచిని పెంచుతాయట. దీని ప్రకారం, అరటి ఆకులపై భోజనం చేసేటప్పుడు కొన్ని ఆచారాలు పాటిస్తారు. ఆకులు కడగడం నుంచి చివరికి తినడం, ఆకులు మడతపెట్టడం వరకు చాలా ఆచారాలు ఉన్నాయి.
పూర్వకాలంలో ప్రతి రోజూ అరటి ఆకులోనే భోజనం చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ అలవాటు మారింది.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అరిటాకు భోజనం చేస్తున్నారు. అయితే, అరటి ఆకులో భోజనం అనేది కేవలం సంప్రదాయమే కాదు.. శాస్త్రీయ కారణాల నుంచి జెనెటిక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
పోషక విలువలు
అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలు కొన్ని ఆహారంలోకి చెరతాయి. దీంతో మీరు తినే ఆహారం పోషక విలువలను మరింత పెంచుతుంది. అరటి ఆకులో ఆహారం తీసుకుంటే ఆహారం రుచి పెరుగుతుంది. ఆకులు ఆహారానికి తేలికపాటి, మట్టి రుచిని అందిస్తాయి. ఇది ఆహారం రుచిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది
అరటి ఆకులలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. మీ ఆహరంలో విషం కలిస్తే ఈ అరటి ఆకుల ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు ఆహారాన్ని ఆకులో ఉంచినప్పుడు అందులో విషం ఉంటే ఆ ఆకు నీలిరంగుకు మారుతుంది. ఇలా మీరు బ్యాక్టీరియాను తొలగించవచ్చు, అలాగే మీ ఆహారంలో ఏమైనా ఉన్న తెలుసుకోవచ్చని అంటున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్స్, మినరల్స్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మంచి జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. అరటి ఆకులలో కడుపు సంబంధిత వ్యాధులను నయం చేసే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి డయేరియా, అజీర్తి, ఆసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తాయి.
భూమి కాలుష్యాన్ని తగ్గిస్తుంది
అరటి ఆకులు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే అవి బయోడిగ్రేడబుల్, భూమిలో త్వరగా కలిసిపోతాయి. అరటి ఆకులపై ఆహారం తీసుకోవడం వల్ల ఆహారానికి సంప్రదాయ ఆకర్షణ లభిస్తుంది. మీరు మంచి హృదయంతో ఆహారం తీసుకుంటే, అది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. అరటి ఆకులు ప్లాస్టిక్ లేదా థర్మాకోల్ ప్లేట్‌లతో పోలిస్తే విషపూరితం కాదు, కాబట్టి హానికరమైన రసాయనాలు ఆహారంలో చేరవు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read: మీకు శక్తి కావాలా..! అయితే వీటిని తినాల్సిందే..! ఆరోగ్యానికి మస్తు మంచిదట!
అరటి ఆకు భోజనం ఎలా చేయాలి:
అరటి ఆకులను శుభ్రంగా కడిగి, ఆరనివ్వండి. ఆ తర్వాత ఆకులపై ఆహారాన్ని వడ్డించుకోవాలి. అరటి ఆకులో వడ్డించిన ఆహారాన్ని తిన్నప్పుడు, ఆహారం రుచి మరియు వాసనను ఆస్వాదించవచ్చు. అరటి ఆకులో వడ్డించిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.