BigTV English

June 2024 Grah Gochar: 6 గ్రహాల మహాయోగం.. ఈ 4 రాశుల వారిపై లక్ష్మీదేవి వరాల జల్లు..

June 2024 Grah Gochar: 6 గ్రహాల మహాయోగం.. ఈ 4 రాశుల వారిపై లక్ష్మీదేవి వరాల జల్లు..

June 2024 Grah Gochar: 6 గ్రహాలు కలిసి అరుదైన కలయికను సృష్టించబోతున్నాయి. సూర్యుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్ గ్రహాలు వృత్తాకారంలో కలిసి వస్తున్నాయి. ఈ శుభ యాదృచ్చికం కారణంగా నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. ఆ అదృష్ట రాశులు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


కుంభ రాశి

ఆరు గ్రహాల మహా సంయోగం వల్ల కుంభ రాశి వారికి అదృష్టం మారనుంది. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేయవచ్చు. ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఐక్యత, శాంతి ఉంటుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు.


మిధున రాశి

ఈ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వ్యక్తుల లాభాలు పెరగవచ్చు. కెరీర్‌లో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్‌తో పాటు కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.

వృషభం

గ్రహాల శుభ ప్రభావం ఈ రాశుల వారికి ఆనందం కలిగించనుంది. ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. పిల్లల నుండి కూడా శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులతో పోలిస్తే ఆదాయ వనరులు పెరుగుతాయి.

తులారాశి

జూన్ నెలలో మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను పెంచుకోవచ్చు. ఏ రంగంలో పనిచేసినా లాభాలను ఆర్జించడం ప్రారంభిస్తారు. గత కొన్నేళ్లుగా వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్న అన్నీ తొలగిపోతాయి. తీసుకున్న రుణం వేగంగా తిరిగి చెల్లిస్తారు. దీని కారణంగా ఉపశమనం పొందుతారు.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×