BigTV English

AP Election Results 2024: ఉత్తరాంధ్రలో టీడీపీ జోరు, వైసీపీకి రెండే రెండు

AP Election Results 2024: ఉత్తరాంధ్రలో టీడీపీ జోరు, వైసీపీకి రెండే రెండు
Advertisement

AP Election Results 2024, TDP Alliance win 32 seats in North Andhra: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి ఉత్తరాంధ్ర ఓటర్లు షాకిచ్చారు. ఎక్కడ చూసినా పసుపు జెండా రెపరెపలాడుతోంది. విశాఖను శాసన రాజధానిగా చేస్తానని సీఎం జగన్ చెప్పినప్పటికీ ఓటర్లు ఏ మాత్రం పట్టించుకోలేదు.


ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో సైకిల్ జోరు కొనసాగుతోంది. మొత్తం 34 సీట్లకు గాను 32ని టీడీపీ కూటమి గెలుచుకుంది. కేవలం రెండు సీట్లలో అధికార వైసీపీ సరిపెట్టుకుంది. అందులో పాడేరు, అరకు నియోజకవర్గాలున్నాయి.

2019 ఎన్నికల్లో 34 సీట్లకు గాను 28 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు ఆ పార్టీ కేవలం రెండే రెండు సీట్లకు పరిమితమయ్యింది. శ్రీకాకుళం- 10, విజయనగరం-9 స్థానాల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు.


ALSO READ:  ఏడు జిల్లాల్లో ఫ్యాన్‌కి తెగిన రెక్కలు

గతంలో శ్రీకాకుళంలో పది సీట్లకు గాను 8 వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు అక్కడ ఫ్యాన్ పార్టీ ఖాతా ఓపెన్ కాలేదు. గతంలో విజయనగరం జిల్లాను క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ, ఈసారి అక్కడ ఫలితాలు రివర్స్ అయ్యాయి. ఇక విశాఖలో 15 స్థానాలకు 11 గెలుచుకుంది వైసీపీ. ఈసారి పాడేరు, అరకు గెలిచి పరువు దక్కించు కుంది.

Tags

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి కోపం తెప్పించిన డీఎస్పీ.. డీజీపీ వద్ద పంచాయితీ

Uttarandhra: ఆ ఒక్కటి పూర్తయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదు

Nara Lokesh: ఏపీ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేష్..

Amaravati News: పోలీసు అమర వీరుల సంస్మరణ దినం.. కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Amaravati: సీఎం చంద్రబాబు-జగన్ ఫ్యామిలీల దీపావళి సంబరాలు, మేటరేంటి?

Rain Alert: నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 7 రాష్ట్రాలకు IMD రెడ్ అలర్ట్!

Big Stories

×