Big Stories

Holi Celebrations in Ayodhya Temple: అయోధ్య రామమందిరంలో హోలీ సంబరాలు.. ప్రత్యేక పూజలు..!

Ayodhya Holi Celebrations
Ayodhya Holi Celebrations

Holi celebrations in Ayodhya Temple: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.  ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో తొలిసారిగా హోలీ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సందడి చేశారు. ఒకరిపైఒకరు రంగులు చల్లుకుని హోలీ వేడుకులు జరుపుకున్నారు. ఈ వేడుకల విశేషాలను శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు వెల్లడించింది. ఆ ఫోటోలను  ఎక్స్‌ లో పోస్ట్ చేసింది.

- Advertisement -

హోలీ రోజు అయోధ్య రామ మందిరానికి భక్తులు క్యూ కట్టారు. సోమవారం ఉదయం నుంచే ఆలయం వద్ద బారులు తీరారు. రామ్‌ లల్లాను భక్తులు దర్శించకున్నారు. హనుమాన్‌ గర్హి ఆలయంలోని హోలీ వేడుకలను ప్రారంభించారు. స్వామివారి విగ్రహానికి రంగులు చల్లి సంబరాలు మొదలుపెట్టారు.

- Advertisement -

భక్తిపాటలు ఆలపిస్తూ హోలీ వేడుకులు నిర్వహించుకున్నారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భక్తులు తండోపతండాలు తరలివచ్చారని ఇప్పుడు కూడా అదే విధమైన సందడి ఉందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ తెలిపారు.

Also Read: హోలీ రోజు లక్ష్మీ దేవి అనుగ్రహం.. చేయాల్సిన పూజలు ఇవే..!

అయోధ్య బాలరాముడు ఆలయంలో హోలీ వేడుకలు సందడిగా సాగాయని సంతోషం వ్యక్తం చేశారు.  రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకునేలా సౌకర్యాలు కల్పించింది. హోలీ వేళ ఎలాంటి ఇబ్బంది భక్తులకు కలగకుండా చర్యలు చేపట్టింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News