BigTV English

KTR Goa Politics: మహబూబ్‌నగర్ బైపోల్.. కేటీఆర్ గోవా పాలిటిక్స్..!

KTR Goa Politics: మహబూబ్‌నగర్ బైపోల్.. కేటీఆర్ గోవా పాలిటిక్స్..!

KTR Goa Politics


KTR Goa Politics: మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ బైపోల్‌ మాజీ సీఎం కేసీఆర్‌ను టెన్షన్‌ పెడుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో గోవాలో క్యాంప్ ఏర్పాటు చేశారు.

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గోవా వెళ్లారు. గోవాలో మహబూబ్‌నగర్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం కేటీఆర్ నేతృత్వంలో క్యాంప్‌ పెట్టడంపై రాజకీయంగా వాడివేడి చర్చ జరుగుతోంది.


ఈ నెల 28న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతోంది. బైపోల్‌ కోసం గోవాలో క్యాంప్ పెట్టడంపై పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి భయంతోనే గోవాలో క్యాంప్ పెట్టారంటుని గులాబీ నేతలే అంటున్నారు. ఎమ్మెల్సీ బైపోల్‌లో ఓడిపోతే పరువు పోతుందని, ఆ ప్రభావం పార్లమెంట్‌ ఎన్నికలపైనా పడుతుందని కేసీఆర్, కేటీఆర్ ఆందోళనలో ఉన్నారు.

ఇదే జరిగితే తెలంగాణలో కారు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×