BigTV English

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Astrology 19 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను పెద్దల సహకారంతో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం క్షీణిస్తుంది. శివారాధన శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు వరిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. సరైన సమయంలో సహాయం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


మిథునం:
మిథున రాశి వారికి ఫలప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక వృద్ధి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు ఉంటాయి. శ్రీలక్ష్మీదేవి సందర్శన ఉత్తమం.

కర్కాటకం:
ఈ రాశి వారికి యోగకరంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగాల వారికి ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో తోటివారి సహాయం తీసుకుంటారు. విశ్రాంతి తీసుకోవడం మంచిది. అధికారుల నుంచి అసంతృప్తి కలగవచ్చు. ఉద్యోగులకు శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కలహాలకు దూరంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభకరం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఊహించని ధనప్రవాహం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదవీయోగం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

Also Read:  ప్రతి రోజు ఉదయం ఇలా చేస్తే.. మీ ఇంట్లో డబ్బుకు లోటుండదు

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రమోషన్స్ అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. హనుమ ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారస్తులు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మార్పు విషయంలో తొందరపడొద్దు. కుటుంబ సభ్యులతో గొడవ, వాదనలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో కీలక పనులను పూర్తిచేస్తారు. ఒత్తిడిని తగ్గించుకోవాలి. అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. మాటలను అదుపులో పెట్టుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.

మకరం:
మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏరంగంలో అడుగుపెట్టిన పట్టిందల్లా బంగారం అవుతోంది. ఊహించని శుభఘడియలు రానున్నాయి. శివారాధనతో మంచి జరుగుతంది.

కుంభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబంలో విభేదాలు ఉంటాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఒక శుభవార్త వింటారు. అనవసరంగా డబ్బును వృథా చేస్తారు. ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక లాభం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం.

Related News

Eclipse: గ్రహణం రోజు ఏం చేయాలి ? ఏం చేయకూడదో తెలుసా ?

Peepal Tree: ఇంటి గోడపై రావి చెట్టు పెరగడం శుభమా ? అశుభమా ?

Tulsi Plant: వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఏ దిశలో నాటాలి ?

Ganesh Immersion: మీరు ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారా ? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

Cats Scarified: 4 ఆలయాలు.. 4 పిల్లులు బలి.. ఆ గ్రామానికి అరిష్టమా?

Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావాలంటే.. ?

Big Stories

×