BigTV English

OTT Movie : అమ్మాయి కోసం ప్రాణాలు పణంగా పెట్టే మగాళ్లు… భయపెడుతూనే నవ్వించే ఈ మూవీని ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?

OTT Movie : అమ్మాయి కోసం ప్రాణాలు పణంగా పెట్టే మగాళ్లు… భయపెడుతూనే నవ్వించే ఈ మూవీని ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?

OTT Movie :  ఓటీటీ లో రిలీజ్ అవుతున్న ఇతర జానర్ల సినిమాల కంటే హర్రర్ మూవీస్ ని ప్రేక్షకులు ఎక్కువగానే ఆదరిస్తున్నారు. అందులోనూ హర్రర్ కామిడీ మూవీస్ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అంటే ముందుగానే అలర్ట్ అయ్యి, అలారం పెట్టుకుని మరీ చూడడానికి రెడీగా ఉంటారు హర్రర్ మూవీ లవర్స్. తాజాగా ఇలాగే హర్రర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరపై అలరించిన ఒక మూవీ ఓటీటీలోకి రానుంది. అదికూడా తెలుగులో అందుబాటులోకి రానుండడం విశేషం. మరి ఆ మూవీ పేరెంటి? ఏ ఓటీటీలోకి, ఎప్పుడు రాబోతోంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


రెండేళ్ల తరువాత మోక్షం 

ఇటీవల కాలంలో కొన్నిసినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజులలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే కొన్ని మూవీస్ మాత్రం వెండి తెర మీద హల్చల్ చేసిన చాలా రోజుల తరువాత గానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి నోచుకోవట్లేదు. ఇదే కోవకు చెందిన ఒక మూవీ రెండు సంవత్సరాల క్రితం ఒక కామిడీ హర్రర్ మూవీగా తెరకెక్కి థియేటర్లో హల్చల్ చేసింది. పెద్ద తెరపై ప్రేక్షకులను మెప్పించి ఇప్పుడు ఓటీటీలో ప్రసారం కావటానికి సిద్దంగా వుంది. ఈ మూవీ డిసెంబర్ 20 నుంచి వ్రోట్ (Vrott) అనే ఓటీటీలోకి రాబోతోంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీ పేరు త్రీ మెన్ అండ్ ఎ ఘోస్ట్. ఇదొక కామిడీ హర్రర్ మూవీ. ఈ మూవీని మేకర్స్ 2022 లో రిలీజ్ చేశారు. వెండితెరపై ప్రేక్షకులను అలరించి మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించటానికి రాబోతోంది అంటూ తాజాగా వచ్చిన అప్డేట్ హర్రర్ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.


Tre uomini e un fantasma (2022) - Backdrops — The Movie Database (TMDB)

కధ విషయానికి వస్తే

ఒక భారీ ప్రైజ్ మనీ కోసం ఒక అడ్వెంచర్ టూర్ కొనసాగుతుంది. ఈ అడ్వెంచర్ లో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పాల్గొంటారు. నిజానికి ఆ ముగ్గురు అబ్బాయిలు కూడా చిన్నప్పటి నుంచే స్నేహితులుగా వుంటారు. ఇక ఆ ప్రైజ్ మనీ ఏంటంటే ఒక అమ్మాయి. ఆ విషయం తెలీక ఈ ముగ్గురూ తమ ప్రాణాలను చేజేతులా డేంజర్ లో పడేసుకుంటారు. అయితే అసలు తాము ఎలాంటి సమస్యలో చిక్కుకున్నాము అనే విషయం తెలిసేలోపు ఒక్కో చిక్కు ముడి వీడుతూ ఉంటుంది. చివరికి అసలు విషయం అర్థం అయ్యేలోపు చిన్ననాటి స్నేహితులైన ముగ్గురూ విడిపోతారు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఆ అమాయకంగా కన్పించే అమ్మాయి ఎవరు? ఈ ముగ్గురు స్నేహితులు కలిసి ఎందుకు ఆమె కోసం ఇంత రిస్క్ చేశారు? చివరకు ప్రాణాలతో అక్కడి నుంచి బయటపడ్డారా లేదా? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే డిసెంబర్ లో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేదాకా ఆగాల్సిందే.

Related News

OTT Movie: మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. భయంతో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా మాత్రం చూడకండి..!

OTT Movie : చస్తేనే మనుషులుగా మారే రాక్షస జీవులు… ఊరిని పట్టి పీడించే వింత శాపం… సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : నాలుక కోసి అమ్మాయి హత్య… చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదేం పాడు పనిరా అయ్యా?

OTT Movie : ఫస్ట్ నైట్ నాడు ఏం చేయాలో తెలియని ఆణిముత్యం… ఫ్రెండ్ మాట విని భార్యపై అఘాయిత్యం… ఫీల్ గుడ్ మలయాళ డ్రామా

OTT Movie : రాత్రైతే క్రూరంగా మారే భర్త… తెల్లార్లూ అదే టార్చర్… పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : అంతు చిక్కని ఏలియన్ మిస్టరీ… గవర్నమెంట్ బండారం బట్టబయలు… బుర్రబద్దలయ్యే ట్విస్టులున్న సై-ఫై థ్రిల్లర్

Big Stories

×