Horoscope CAPRICORN 2025 : గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం మకర రాశి జాతకులకు ఆదాయం -8, వ్యయం-14గా ఉంది. అంటే ఎనిమిది రూపాయలు సంపాదిస్తే.. 14 రూపాయలు ఖర్చు చేస్తారు. ధన పరంగా మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇక రాజ్యపూజ్యం-4, అవమానం -5 గా ఉంది. అంటే నలుగురు మీకు గౌరవం ఇస్తే.. ఐదు మంది మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి : మకర రాశి జాతకులకు ఈ నెలలో పరిశ్రమల వారికి లాభాలు ఉన్నాయి. నిరుద్యోగులకు శుభపరిణామం నూతన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కళాకారులకు ప్రోత్సాహక పూరిత వాతావరణం ఉంటుంది. మహిళా ఉద్యోగ, వ్యాపారులకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది.
ఫిబ్రవరి : మకర రాశి జాతకులకు ఈ నెలలో కొన్ని విషయాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు, ఏకాగ్రతతో వ్యవహరించాలి. కిరాణా, ఫ్యాన్నీ, రైసు మిల్లుల వారికి ఈ నెలంతా ఆశాజనకంగా ఉంటుంది. ఇనుము, సిమ్మెంటు, మత్తుపానీయం, మాంసం వ్యాపారులకు లాభాలు వస్తాయి.
మార్చి : మకర రాశి జాతకులకు ఈ నెలలో ఉన్నత వర్గం నుంచి మీకు సహాయం అందుంతుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయదారులకు ఈ నెలంతా లాభిస్తుంది. శ్రమ, శ్రద్ధతో చదివిన విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.
ఏప్రిల్ : మకర రాశి జాతకులకు ఈ నెలలో మీరు మీ తల్లిదండ్రులకు ఆనందం కలిగించే పనులు చేస్తారు. శరీర ఆరోగ్యం కుదుట పడుట, సుఖం, సంతోషం, స్నేహితులతో కలసి యుండుట, మనస్సుకు ఉల్లాసం తోబుట్టువులతో విందు, వినోదాలలో పాల్గొంటారు.
మే : మకర రాశి జాతకులకు ఈ నెలలో వాహన లాభం ఉంది. మంచి భోజన ప్రియులకు తృప్తికరమైన భోజనం లభిస్తుంది. వస్త్ర, మౌలికా, వడ్డీ వ్యాపారులకు ఈ నెలంతా అనుకూలంటా ఉంటుంది.
జూన్ : మకర రాశి జాతకులకు ఈ నెలలో ప్రయాణంలో లాభం చేకూరుతుంది. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి, ఆరోగ్యము. స్త్రీలు కొద్దిగా నిదానించి మాట్లాడటం మంచిది. వివాహం కానివారికి ఈ నెలలో వివాహానికి అనుకూలంగా ఉంది.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
జూలై : మకర రాశి జాతకులకు ఈ నెలలో ఆందోళనలు కలుగుతాయి. ప్రయత్నము మీద పనులలో విజయం చేకూరుతుంది. ఇతరులను ప్రగతి మార్గములోకి నడుపుతారు. వస్త్ర, పుష్ప, మూలికా రంగాల వారికి నెలంతా లాభాలు వస్తాయి.
ఆగష్టు : మకర రాశి జాతకులకు ఈ నెలలో ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆదాయం బాగుంటుంది. అధిక ధనవ్యయం చేయాల్సి వస్తుంది. శత్రువులతో ఇబ్బందులు పడతారు. స్త్రీలకు ఈ నెలంతా అతంతమాత్రంగానే ఉంటుంది.
సెప్టెంబర్ : మకర రాశి జాతకులకు ఈ నెలలో ఆదాయం విషయంలో గతము కంటే మేలు జరగుతుంది. మత్స్య పరిశ్రమ, పౌల్ర్టీ పరిశ్రమ, పాడి పరిశ్రమల రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
అక్టోబర్ : మకర రాశి జాతకులకు ఈ నెలలో కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. ఆరోగ్యము అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ వస్త్ర, పూల వ్యాపారులకు మాత్రం ఈ నెలంతా లాభాలు వచ్చే అవకాశం ఉంది.
నవంబర్ : మకర రాశి జాతకులకు ఈ నెలలో మూడు పువ్వులు ఆరుకాయలు చందంగా ఉంటుంది. ధనధాన్య ప్రవర్ధనం పుత్ర పౌత్ర వివర్ధనంగా ఉంటుంది. కార్యాచరణతో ముందుకు వెళతారు. రాజకీయ నాయకులకు పదవులొస్తాయి.
డిసెంబర్ : మకర రాశి జాతకులకు ఈ నెలలో వస్తు, భూషణము కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. అకాల భోజనము చేయుట వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?