BigTV English

CM Revanth Reddy: హనీమూన్ టైం అయిపోయిందమ్మా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్

CM Revanth Reddy: హనీమూన్ టైం అయిపోయిందమ్మా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్

CM Revanth Reddy: ఏడాది పాలనలో ఎమ్మెల్యే పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారా? అందుకు తగినట్లే వారికి టార్గెట్ ఫిక్స్ చేశారా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకూ నేతలకు సుతిమెత్తగా చెప్పిన ముఖ్యమంత్రి.. కొందరు నేతలు మాత్రం తమ తీరు మార్చుకోవాలంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారట. నిత్యం ప్రజలతో ఉండేలా చూసుకుని.. అటు ఓటర్లతో పాటు క్యాడర్‌ను కాపాడుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. ఏడాదిలో నేర్చుకున్న అంశాలు.. గుర్తించిన తప్పులను పునరావృతం కాకుండా చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి చేసి వ్యాఖ్యలు.. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.


తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా.. సీఎం రేవంత్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు, నేతలకు సూచనలు చేశారు. కొందరు నేతలకు ఇచ్చిన హనీమూన్ పీరియడ్ అయిపోయిందని.. ఎవరైనా సరే.. ప్రజలతో మమేకమై వారి సమస్యలపై దృష్టి సారించకపోతే.. ఉపేక్షించబోనన్నారు సీఎం రేవంత్‌. BRS సర్కారు అవలంభించిన తీరుతో జనం విసిగిపోయి.. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందున.. వారికి సేవ చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిలో నేర్చుకున్న పాఠాలు.. దొర్లిన తప్పులను సవరించుకుని.. నాలుగేళ్ల కోసం పనిచేయాలంటూ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఓ వైపు సూచనలు చేస్తూనే.. ఎమ్మెల్యేకు గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. MLAల పని తీరు, వారి ప్రోగ్రెస్ పై సర్వే రిపోర్టులు తన వద్ద ఉన్నాయని చెప్పారట. తన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నానని సీఎం చెప్పటంతో.. ఎమ్మెల్యేలంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారట. కొత్త ఏడాదిలో ప్రజలకు చేరువ కావాలన్న విషయాన్ని బలంగా చెప్పటం సహా ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను.. నేతలు అనుకూలంగా మార్చుకోవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. తొలిసారి గెలవటం గొప్పేం కాదని.. రెండోసారి గెలుపే నిజమైన విజయమన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డారట. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన డైరెక్షన్.. ఫాలో కాకుంటే వచ్చే ఎదురయ్యే సమస్యలపైనా నేతల్లో చర్చ సాగుతోందట.


తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు.. పదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా పరిపాలించిందని ఆరోపించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అదే తప్పును కాంగ్రెస్ పార్టీ నేతలూ చేస్తామంటే ఉపేక్షించబోనంటూ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు.. ఓటర్లు అధికారం ఇచ్చారని.. అందుకు తగిన విధంగా పనిచేసి వారి రుణం తీర్చుకోవాలని సీఎం గట్టిగానే చెప్పారట. మనం అడిగినట్లే వాకు అధికారం ఇచ్చారు కాబట్టి.. వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. అందుకు ఎవరూ అతీతులు కాదంటూ సీఎం.. చెప్పకనే చెప్పేశారట.

Also Read: 2025లో వరాల జల్లు.. రేవంత్ సర్కార్ చేపట్టనున్న పనులు, పథకాలు ఇవే!

అందరూ కష్టపడి పనిచేసి ఓటర్లు కోరుకున్న పాలన అందించాలి తప్ప.. వేరే విధంగా ఆలోచిస్తే మాత్రం వేటు తప్పదనే హెచ్చరికలు కూడా చేశారు. దీంతో కొందరు నేతలు ఉలిక్కిపడ్డారనే వార్తలూ వినిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను అధిగమించేందుకు కృషి చేయాలని.. అలా కాకుండా వాటిని భూతద్దంతో చూపిస్తే మాత్రం వేటు తప్పదని ఘాటుగానే ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం. సర్కారు చేసే పనులపై బీఆర్‌ఎస్ చేస్తున్న దుష్పచారాన్ని తిప్పికొట్టాలంటూ ఎమ్మెల్యేలకు గట్టిగానే సీఎం చెప్పినట్లు టాక్ నడుస్తోంది.

ప్రజాప్రతినిధులుగా మనం చేసే పనులన్నీ ప్రజలకు రిజిస్టర్ అవుతుంటాయని కాబట్టి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌ హెచ్చరికలు జారీ చేశారట. ఈ విషయాన్ని నేతలు ఈజీగా తీసుకోవద్దని.. అలా చేసిన వారిని తప్పించేందుకు కూడా ఆలోచించబోమని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించినట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న సమయంలో… క్యాడర్‌ను కలుపుకుని ముందుకు వెళ్లాలని.. ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా చెప్పినట్లు వార్తలు వినిపిస్తు్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు.. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని.. క్యాడర్ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని.. వారికి సహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారట. ప్రతి ఒక్కరూ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని.. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తానని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరారని… అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలంటూ నేతలకు సీఎం ఘాటుగానే చెప్పేరట. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే సమాచారం తన వద్ద ఉందని చెప్పటంతో.. ఎమ్మెల్యేలు.. మరింత జాగ్రత్త పడే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×