Horoscope cancer 2025 : గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం కర్కాటక రాశి జాతకులకు ఆదాయం -8, వ్యయం-2గా ఉంది. అంటే ఎనిమిది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. ధన పరంగా కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. ఇక రాజ్యపూజ్యం-7, అవమానం – 3 గా ఉంది. అంటే ఏడు మంది మీకు గౌరవం ఇస్తే.. ముగ్గురు మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి: కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో ప్రయాణాలలో ఇబ్బందులకు గురి అవుతారు. సంతానం విషయంలో అభివృద్ది కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. వివిధ రంగాల వారికి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.
ఫిబ్రవరి : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో ఇంట్లో మంచి మార్పులు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. గురువులు, పెద్దల ఆశీస్సులు పొందుతారు. అయితే వివిధ రకాల కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం లభించదు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
మార్చి : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో నిరాశావాదం నెలకొంటుంది. కార్మికులకు, కూలీలకు, చేతివృత్తుల వారికి శ్రమకు తగిన ఫలితం ఉండదు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఏప్రిల్ : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో గొడవలు ఎక్కువగా జరుగుతాయి. పితృవర్గం వారి నుంచి చెడు వార్తలు వింటారు. నెల చివరిలో ఆకస్మిక ధన లాభం ఉంది. కోర్టు వ్యవహారములు వాయిదా కోరుట మంచిది.
మే : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలంతా అనుకూలంగా ఉంటుంది. అప్రయత్న కార్యసిద్ధి చేకూరుతుంది. సుఖం, లాభం, ధనం సవ్యంగా దొరుకుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యా బిడ్డల సహకారం లభిస్తుంది. . వృత్తి, ఉద్యోగ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.
జూన్ : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో ధనలాభం, ద్రవ్యలాభం, వస్తు లాభం, వాహన లాభం, మైత్రి లాభం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సమయానికి అనుకూలంగా పనులు చేయుట మంచిది. క్రీడాకారులు మంచి విజయాలు సాధిస్తారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
జూలై : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో ఆధ్యాత్మిక విషయాలలో మునిగిపోతారు. జ్ఞాన సముపార్జన చేస్తారు. యోగాభ్యాసమునకు ప్రాధాన్యత ఇస్తారు. ఆనందం, ధనం, సుఖం, కీర్తి వర్ధిల్లుతుంది. వస్తు, పుష్ప మాలికా మొదలగు లాభములు కలుగుతాయి.
ఆగష్టు : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో ఆదాయం పెరుగుతుంది. చేతి నిండా ధనం నిల్వ ఉంటుంది. చిన్నచిన్న తగువులు వస్తాయి. చేతి పనివారు, మట్టి పనివాళ్లకు, బిల్డింగ్ పనివాళ్లకు పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
సెప్టెంబర్ : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో వ్యాపారాలలో లాభాలు అంతంత మాత్రంగానే వస్తాయి. అయితే కుమారుని వలన ధనప్రాప్తి కలుగుతుంది. వస్త్ర సంబంధ వ్యాపారములకు ఈ నెలలో శ్రీకారం చుడతారు.
అక్టోబర్ : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో శరీర ఆరోగ్యము బాగుంటుంది. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. ధనప్రాప్తి ఉంటుంది. స్పోర్ట్స్ రంగాలలో వారికి వృత్తి పరంగా లాభాలు ఉన్నాయి.
నవంబర్ : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో విందు వినోదాలలో పాల్గొంటారు. శుభకార్యక్రమాలకు, తీర్థయాత్రలు చేయుటకు సుముఖత చూపుతారు. ఇతరులు మీకు గౌరవం ఇస్తారు. ఉద్యోగస్తులకు మంచి కాలం.
డిసెంబర్ : కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో మంచి అభివృద్ధి జరుగుతుంది. సుఖసంతోషాలతో ఉంటారు. కార్యసఫలం, సంతోషం, తీర్ధయాత్రలు చేస్తారు. కొత్త ఇంటి నిర్మాణం చేయడానికి అనువైన కాలం.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?