BigTV English

Mega Heros : 2025 మెగా నామ సంవత్సరం… మెగా హీరోల సినిమా జాతర

Mega Heros : 2025 మెగా నామ సంవత్సరం… మెగా హీరోల సినిమా జాతర

Mega Heros : 2025 ఏడాదిలో మెగా నామస్మరణ జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా హీరోల సినిమాలు ఈ ఏడాది ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ కాబోతున్నాయి. రామ్ చరణ్ (Ram Charan) ఈ మెగా ఫెస్టివల్ ని మొదలు పెడితే, సాయి దుర్గా తేజ్ 2025కు ‘సంబరాల ఏటిగట్టు’ (SYG) మూవీతో ఎండ్ కార్డ్ వేయబోతున్నారు.


ఇక 2025లో రిలీజ్ కాబోతున్న మెగా సినిమాలలో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘దే కాల్ హిమ్ ఓజి’ (OG), చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara), మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Drugha Tej) ‘సంబరాల ఏటిగట్టు’ (SYG) వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలన్నీ కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం మెగా నమస్కరణ జరగబోతోంది.

నిజానికి గత ఏడాది మెగా హీరోలకు బ్యాడ్ ఇయర్ గా మారింది. సినిమాల పరంగా ఏడాది మొదట్లోనే మొదలైన దురదృష్టం చివరి వరకూ సాగింది. వరుణ్ తేజ్ (Varun Tej) ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలతో పలకరించారు. కానీ అందులో కనీసం ఒక్కటి కూడా సరైన ఓపెనింగ్ రాబట్టలేక చతికిలబడింది. ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమా రేపో మాపో అంటూ 2025 కు వచ్చి పడింది. ‘పుష్ప 2’ మూవీ అన్ని రికార్డులను తుడిచి పెట్టినప్పటికీ, సంధ్య థియేటర్ వివాదం బన్నీ (Allu Arjun) మెడకు చుట్టుకోవడంతో ఇప్పటికీ దాంతోనే పోరాడుతున్నారు.


ఇక మిగతా హీరోలు ఎవ్వరూ తెరపై కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి చివరగా 2023 లో రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. కానీ ‘భోళా శంకర్’ మూవీ బెడిసి కొట్టడంతో ఆయన తెరపైకి రావడానికి దాదాపు ఏడాది టైం తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు మూడేళ్ల నుంచి ‘గేమ్ ‘ఛేంజర్’ రిలీజ్ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడం వల్ల ఆయనను కూడా తెరపై మిస్ అవుతున్నారు.

కానీ ఈ ఏడాది మాత్రం మెగా ఫాన్స్ ఆకలిని తీర్చడానికి సిద్ధమయ్యారు మెగా హీరోలు. 2025 జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మార్చ్ 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇక సెప్టెంబర్ 25 న ‘సంబరాల ఏటిగట్టు’ మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నారు సాయి దుర్గా తేజ్. మరో రెండు మెగా సినిమాలు ‘ఓజీ’, ‘విశ్వంభర’ కూడా ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. కానీ ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లను ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×