BigTV English

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ఆ వారసుడి కెరీర్‌ను కాపాడుతుందా.?

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ఆ వారసుడి కెరీర్‌ను కాపాడుతుందా.?

Sai Pallavi: ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా చాలావరకు హీరోకు, దర్శకుడికే వెళ్తుంది. కానీ ఫ్లాప్ అయితే మాత్రం వెంటనే అందులో నటించిన హీరోయిన్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక హీరోయిన్ నటించిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు హిట్ అయితే తనను గోల్డోన్ లెగ్ అని, ఫ్లాప్ అయితే ఐరెన్ లెగ్ అని ముద్రవేసేస్తారు. అది తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొందరు హీరోయిన్స్ మాత్రమే హిట్, ఫ్లాప్‌కు సంబంధం లేకుండా తమ నటనతో ఆకట్టుకొని ఆఫర్లు సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. సౌత్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి.. బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకోనుంది.


హీరోయిన్‌పై నమ్మకం

చాలామంది సౌత్ హీరోయిన్లు ఇక్కడ పాపులారిటీ వచ్చిన తర్వాత బాలీవుడ్‌కు వెళ్లడం సహజమే. కానీ అక్కడ కూడా సక్సెస్ అయినవారు చాలా తక్కువమంది ఉన్నారు. తాజాగా కీర్తి సురేశ్ కూడా బాలీవుడ్‌కు వెళ్లి ఎన్నో ట్రోల్స్ ఎదుర్కుంది. మరి బాలీవుడ్‌లో సాయి పల్లవి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. ప్రస్తుతం సాయి పల్లవి ఫ్యూచర్ మాత్రమే కాదు.. ఒక బాలీవుడ్ స్టార్ హీరో వారసుడి ఫ్యూచర్ కూడా తన చేతిలోనే ఉంది. మామూలుగా ఈ హీరోయిన్ నటించిందంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని నమ్మి థియేటర్లకు వచ్చి చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు ఆ బాలీవుడ్ స్టార్ హీరో వారసుడిని కూడా సాయి పల్లవి (Sai Pallavi) అలాగే కాపాడాలి.


Also Read: బుట్టబొమ్మ భయపెడుతుందా.. మాకు నమ్మకం లేదు దొరా..?

వారసుడి ఎంట్రీ

బాలీవుడ్‌లో ఎంతోమంది వారసులు ఉండగా అందులో అమీర్ ఖాన్ వారసుడు కూడా యాడ్ అయ్యాడు. నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలయిన ‘మహారాజా’ మూవీతో అమీర్ వారసుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ప్రతీ నెపో కిడ్‌లాగానే జునైద్ యాక్టింగ్‌పై కూడా విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఇప్పుడు నేరుగా వెండితెరపై వెలగడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే జునైద్ హీరోగా నటిస్తున్న ‘లవ్యాపా’ అనే మూవీ షూటింగ్ ప్రారంభయ్యింది. దానికంటే ముందే సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ‘ఏక్ దిన్’ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ రెండూ 2025లో విడుదలకు సిద్ధమయ్యాయి.

రెండూ ఒకేసారి

జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా నటిస్తున్న ‘లవ్యాపా’, ‘ఏక్ దిన్’.. ఈ రెండు సినిమాలు రొమాంటిక్ డ్రామాలుగానే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ‘లవ్యాపా’ సినిమా ఎలా ఉంటుందని తెలియదు కానీ ‘ఏక్ దిన్’పై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి ముఖ్య కారణం సాయి పల్లవి. తను నేరుగా హిందీలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా తన యాక్టింగ్ టాలెంట్ గురించి బీ టౌన్ ప్రేక్షకులకు కూడా తెలుసు. అందుకే నితేష్ తివారీ లాంటి దర్శకుడు సైతం సాయి పల్లవిని ‘రామాయణ్’లో సీతగా సెలక్ట్ చేశాడు. అసలైతే సాయి పల్లవి ముందుగా ‘రామాయణ్’ సినిమానే సైన్ చేసినా.. ‘ఏక్ దిన్’ మాత్రం ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×