Astrology 24 November 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం ప్రతి రాశి ఒక గ్రహంచే పాలించబడుతుంది. గ్రహాలు, నక్షత్రాల కదలిక ఆధారంగా జాతకాన్ని అంచనా వేస్తారు. నవంబర్ 24 ఆదివారం. ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడింది. ఈ రోజు సూర్యుడిని వివిధ ఆచారాలతో పూజిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 24 కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుండగా, కొన్ని రాశుల వారు జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నవంబర్ 24, 2024న ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈరోజు మేషరాశి వారికి మంచి రోజు. మీ వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. సహోద్యోగి సహకారంతో పెద్ద ప్రాజెక్ట్‌లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనవసర వాదనలు మానుకోండి.మీ కుటుంబ జీవితం బాగుంటుంది. ఆర్థికంగా మంచి పనితీరు కనబరుస్తారు. పూర్తి విశ్వాసం ఉంటుంది.
వృషభ రాశి: ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాలలో ఈ రోజు ప్రయోజనకరమైన రోజు. ఈరోజు షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయం. మీ మాటలో మాధుర్యం ఉంటుంది. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడంలో మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మిథునరాశి : ఈరోజు మిథునరాశి వారికి శుభప్రదమైన , ఫలవంతమైన రోజు. మీరు మీ పిల్లల నుండి శుభవార్త పొంతుదారు. తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు. వ్యాపారులకు ఈరోజు లాభదాయకమైన రోజు. ఆర్థికంగా లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ వివాదం ముగుస్తాయి.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి రోజు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి.మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఊహించని ధనలాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఈరోజు ఆశించిన లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి: సింహ రాశికి చెందిన వ్యాపారులు ఈరోజు లాభాలను పొందుతారు. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఈరోజు సంపాదనకు అనుకూలమైన రోజు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు లాభ సూచనలున్నాయి. మీరు సోదరులు, సోదరీమణుల నుండి మద్దతు పొందుతారు. కొంతమందికి పెళ్లి కూడా ఫిక్స్ కావచ్చు.
కన్య రాశి: కన్యా రాశి వారికి ఈరోజు ఏ ప్రణాళిక అయినా విజయవంతమవుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. మీ ఆఫీసుల్లో గౌరవం పెరుగుతుంది.
తులా రాశి: తులా రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. మీరు కొన్ని నిలిచిపోయిన పనులల్లో విజయం పొందుతారు. మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మనసు ఆనందంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు. వ్యాపారానికి సంబంధించిన ఒప్పందం ఖరారు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు చేస్తున్న వారు ఆఫీసులు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఈరోజు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. సహోద్యోగుల సహకారంతో కొన్ని గొప్ప విజయాలు సాధిస్తారు.
ధనస్సు రాశి: ధనుస్సు రాశి వారు ఈరోజు తమ పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల బంధం బలపడుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్‌తో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులపై నియంత్రణ ఉంచండి.
మకర రాశి: ఈ రోజు మకర రాశి వారికి మంచి రోజు. జీవితంలోని అనేక అంశాలలో విజయం సాధించవచ్చు. భూమి, భవనం,వాహన కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారం చేసే వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయాణాలు వాయిదా వేయండి.
Also Read: బృహస్పతి, అంగారకుడి తిరోగమనం.. ఈ రాశుల వారికి అడుగడుగునా కష్టాలు
కుంభ రాశి: కుంభ రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారు తమ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. గృహ వివాదాలకు దూరంగా ఉండండి. తండ్రి సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
మీన రాశి: ఈరోజు మీన రాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గౌరవం కూడా పెరుగుతుంది. మీకు ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి.