BigTV English
Advertisement

Akkineni Nagarjuna: నాన్నగారి లైఫ్ చాలా బోర్.. బయోపిక్ తీయకపోవడమే మంచిది

Akkineni Nagarjuna: నాన్నగారి లైఫ్ చాలా బోర్.. బయోపిక్ తీయకపోవడమే మంచిది

Akkineni Nagarjuna: టాలీవుడ్ లెజెండ్స్ లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్టీఆర్ తో సరిసమానంగా ఎదిగి, పోటీకి నిలబడి..  చరిత్ర  పుస్తకాల్లో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు ఏఎన్నార్. తన ఆఖరి శ్వాస  వరకు కూడా సినిమాల్లోనే కనిపించారు. ఆయన ఇప్పుడు భూమి మీద లేకపోయినా.. ఆయన సినిమాలు,  అక్కినేని లెగసీ ఎప్పటికప్పుడు ఆయనను గుర్తుచేస్తూనే ఉంటాయి. తండ్రి గౌరవాన్ని కొడుకుగా అక్కినేని నాగార్జున కాపాడుతూ వస్తున్నాడు.  ఈ మధ్యనే  ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.


తాజాగా నాగ్.. గోవాలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇఫీ వేడుకలకు కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. ఈ వేడుకల్లోనాగ్.. తన తండ్రి ఏఎన్నార్ కు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో  పంచుకున్నాడు. అంతేకాకుండా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చాడు. ఇక ఒక అభిమాని ఏఎన్నార్ బయోపిక్ గురించి అడగగా.. నాగ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పి షాక్ ఇచ్చాడు.

Divya PIllai: మంగళవారం జమీందార్ భార్య.. మంచి పాన్ ఇండియా సినిమా పట్టిందిగా


నిజం చెప్పాలంటే, ANR బయోపిక్ బోరింగ్‌గా అనిపించవచ్చు, ఎందుకంటే ఆయన జీవితం చాలా వరకు ఎత్తులోనే ఉంది.  అప్స్ అండ్ డౌన్స్ లో ఉంటే  బయోపిక్  అని చెప్పొచ్చు.. ఆయన లైఫ్ ఎప్పుడు  అలా గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది.  బయోపిక్ తీయాలంటే.. సినిమాలో కొంత కల్పన ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్ చూపించాలి. ఇవేమి లేకుండా బయోపిక్ తీస్తే బోరింగ్ గా ఉంటుంది.

అప్పుడు  బయోపిక్ తీయకపోవడమే మంచిది. దానికి  బదులుగా మేము ANRపై ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తాము.. ఆయన పూర్తీ జీవితాన్ని చుపిస్తాము” అని తెలిపాడు. దీంతో అభిమానులు కొంత నిరాశచెందారు. ఒకవేళ ఏఎన్నార్ బయోపిక్ కనుక ఉంటే.. అక్కినేని హీరోల్లో ఎవరో ఒకరు అందులో కనిపించేవారు. అలాంటి అవకాశం లేకపోవడంతో.. కొద్దిగా నిరాశకు గురయ్యారు.

Actress Anjali : కొత్త రంగులు వెతుక్కుంటున్న గేమ్ ఛేంజర్ బ్యూటీ

అయినా కూడా డాక్యుమెంటరీ ఉందని నాగ్ చెప్పడంతో.. ఆయన గురించి తెలుసుకోవడం సంతోషమే అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక నాగ్ కెరీర్ విషయానికొస్తే  ప్రస్తుతం హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్స్ చేయడానికి సిద్దమయ్యాడు. కూలీ, కుబేర సినిమాల్లో  నాగ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాలతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×