BigTV English

OTT Movie : పోలీసులకు చుక్కలు చూపించే క్రైమ్ థ్రిల్లర్… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : పోలీసులకు చుక్కలు చూపించే క్రైమ్ థ్రిల్లర్… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్  అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్  మూవీస్  మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఈ సినిమాలు మొదటినుంచి చివరిదాకా చూస్తున్నంత సేపు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఎక్కువగా మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఆ సినిమాలను దర్శకులు వెండి తెర మీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు.   మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వెండి తెర మీద హల్చల్ చేసి, ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్టీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ పేరు “కురుక్కు” (Kurukku) ఈ మూవీ లో ఒక డబుల్ మర్డర్ కేసును ఇన్స్పెక్టర్ టేకప్ చేస్తాడు. ఆ మర్డర్స్ ఎవరు చేశారో తెలుసుకునే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ  ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

రూబిన్, స్నేహ అనే భార్యాభర్తలు ఒక అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు గొడవ పడుతుంటే, జార్జ్ అనే వ్యక్తి తాగిన మత్తులో వీళ్లకు వార్నింగ్ ఇస్తాడు. ఆ మరుసటి రోజు రూబిన్, స్నేహ ఇద్దరూ హత్యకు గురై ఉంటారు. పోలీస్ అధికారులు ఈ కేసును ఫిలిప్స్ అనే ఇన్స్పెక్టర్ కి అప్పజెప్తారు. హత్య జరిగిన అపార్ట్మెంట్లో అందరిని విచారించగా, వాళ్లు పెద్దవాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకున్నారని సమమాచారం వస్తుంది. చివరగా జార్జిని చేతికి గాయం ఉండటంతో అతనిపై అనుమానం వ్యక్తం చేస్తారు . స్నేహ పేరెంట్స్ కి రూబిన్ ఇష్టం లేకపోవడంతో, వారేమైనా చేసి ఉంటారేమో అని విచారణకి వెళ్తారు. అక్కడ స్నేహ పేరెంట్స్ రూబిన్ అంత మంచివాడు కాదని, అతనికి చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందని చెప్తారు.  ఒకసారి అతన్ని కొట్టించిన మాట వాస్తవమే అని ఒప్పుకుంటారు. ఆ తర్వాత వాళ్లను మేము దూరంగా పెట్టామని ఇన్స్పెక్టర్ కి చెప్తారు. ఇలా ఉంటే హత్య జరిగిన అపార్ట్మెంట్లో ఆ రోజు అనుమానస్పదంగా సంచరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వాళ్లని  గుర్తుతెలియని మనుషులు లారీ తో గుద్దించి చంపేస్తారు. పోలీసులు ఈ హత్యలు కూడా ఎవరు చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఈ క్రమంలో చనిపోయిన డెడ్ బాడీల దగ్గర జార్జ్ వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి బయటకు వస్తుంది. పోలీసులంతా ఈ హత్య జార్జ్ చేసి ఉంటాడని ప్రెస్ మీట్ పెడతారు. అయితే ఫిలిప్ మాత్రం జార్జిని బలి పశువును చేశారని నమ్ముతాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఎవరో  జార్జిని ఇరికించారని అనుకుంటాడు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ ఈ కేసును తన స్టైల్ లో విచారణ చేయాలనుకుంటాడు. రూబిన్ కు ఉన్న అక్రమ సంబంధాలను వెతికి తీయాలనుకుంటాడు. రూబిన్ కు ఉన్న అక్రమ సంబంధాల నుంచి విచారణ మొదలుపెడతాడు. ఈ విచారణలో ఇన్స్పెక్టర్ కి దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఈ హత్యలను చేసింది ఎవరు? ఇన్స్పెక్టర్ విచారణలో తెలుసుకున్న విషయాలు ఏంటి? ఈ హత్యలను నిజంగానే జార్జ్ చేశాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

Big Stories

×