Astrology 5 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలను తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. సమాజంలో హోదా లభిస్తుంది. ఇతరులతో ఆచిచూతి వ్యవహరించాలి. అతిగా ఎవరినీ నమ్మవద్దు. ఇష్టదేవారాధన శుభకరం.
వృషభం:
వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి ధనం అందుతుంది. శివారాధనతో మంచి ఫలితాలు.
మిథునం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి కీలకమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తోటివారి సహకారంతో విజయవంతమవుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సంతానం అభివృద్దిపై దృష్టి సారిస్తారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నారాయణ మంత్రాన్ని జపించాలి.
కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు పురోగతి, ఆర్థిక వృద్ధి ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బంధువుల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి తగ్గించుకుంటే మంచిది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. వృథా ఖర్చులు ఉంటాయి. ఇతరుల ప్రవర్థనతో ఇబ్బందులు పడుతారు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. గిట్టనివారితో ఆచితూచి వ్యహరించాలి. మీ ప్రవర్తన మేలు చేస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాధ్యానం చేయడం మంచిది.
Also Read: ఈ ప్రత్యేక యోగంతో 3 రాశుల వారికి ప్రతీ అడుగునా అదృష్టమే
తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారాల్లో ఫలితాలు అంతంతమాత్రమే ఉంటాయి. కీలక వ్యవహారాల్లో మనసుపెట్టి పనిచేస్తే విజయం పొందుతారు. ప్రతి అడుగు ఆచితూచి వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. కీలక విషయాల్లో సహనం పాటించాలి. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. హనుమన్ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆవేశాలకు తావు ఇవ్వొద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మోహమాటం దరిచేరనీయవద్దు. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల విషయం జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అభయ ఆంజనేయస్వామి ప్రార్థనతో ఆపదలు తొలగిపోతాయి.
మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారు శుభ ఫలితాలు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభవార్త వింటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి మెలిసి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం.