The Goat Twitter Review: విజయ్ దళపతి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన నటన, స్వాగ్, స్టైల్, డైలాగ్ డెలివరీ ఇలా ఎందులోనూ తక్కువకాదు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఆయన సినిమా వస్తుందంటే కోలీవుడ్, టాలీవుడ్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఇక గతేడాది విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘లియో’ మూవీ సినీ ప్రేక్షకుల్ని ఓ మోస్తారులో ఆకట్టుకుంది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించడంలో కాస్త విఫలం అయింది.
మొదట్నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకుంది. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్,సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క విభాగంలో అంచనాలు పెంచుకుంది. కానీ రిలీజ్ అనంతరం బాక్సాఫీసు వద్ద తుస్సుమంది. ఎన్నో ఎక్స్‌పెర్టేషన్స్ పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. ఈసినిమాలో విజయ్ మాస్ యాక్షన్ రోల్‌లో చించి చెండాడేస్తాడు అనుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అలాంటి అవకాశం దక్కలేదు. ఇందులో విజయ్ రోల్ చాలా పిరికివాడిలా ఉండటంతో అంతా షాకైపోయారు. దీంతో చాలా మంది తన అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా లేదని కామెంట్లు కూడా చేశారు. అయితే బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. తెలుగులో కంటే తమిళంలో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.
ఇక ఇప్పుడు విజయ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘ది గోట్’ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో విజయ్ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఎన్నో అంచనాలను సైతం క్రియేట్ చేసుకుంది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటి రిలీజ్ చేసిన మేకర్స్ ఈ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశారు. కాగా ఇందులో విజయ్ తండ్రి కొడుకుల పాత్రలో డబుల్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకాభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అలాంటి అంచనాలతోనే ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో యూఎస్‌లో ప్రీమియర్స్ షోలు పడ్డాయి. దీంతో చాలా మంది ఆడియన్స్ తమ రివ్యూని ట్విట్టర్ ఎక్స్ ద్వారా పంచుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ట్టిట్టర్ ఎక్స్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ఓ నెటిజన్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ రివ్యూ అంటూ తెలుపుతూ.. సినిమా ఫస్ట్ హాప్ అత్యద్భుతంగా ఉందని రాసుకొచ్చాడు. ఈ ఫస్ట్ హాఫ్‌లో ఫన్ అండ్ క్యూట్ ఫ్యామిలీ మూమెంట్స్‌తో అదరగొట్టేశాడని తెలిపాడు. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఫస్ట్‌హాఫ్‌కి ప్రాణం పోసిందని చెప్పుకొచ్చాడు. అలాగే ఇంటర్వెల్ బ్యానర్ గూస్ బంప్స్ వచ్చాయని రాసుకొచ్చాడు.
#TheGOAT First Half Review 💥🔥 pic.twitter.com/UXyLf34Z8K
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) September 5, 2024
ఈ సినిమా చూసిన ఓ నెటిజన్ ‘ది గోట్’ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఇంటర్వెల్‌ను ఎవరూ ఊహించలేరని చెప్పుకొచ్చాడు.
#TheGOAT Interval block😭📈🔥 pic.twitter.com/TI9aPvjk9K
— Fayas.naxiim🐿️ (@__faaaz__) September 5, 2024
అలాగే ఈ సినిమా చూసిన మరోకరు ట్వీట్ చేస్తూ.. ఫస్ట్‌హాఫ్ చాలా బాగుందని.. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందని రాసుకొచ్చాడు. ఇంకొకరేమో ‘వి వన్ తలైవా.. బ్లాక్ బస్టర్’ అనిరాసుకొచ్చాడు. సినిమా అత్యద్భుతంగా ఉందని తలవై మరో హిట్ కొట్టాడని చెప్పుకొచ్చాడు.
We Won Thalaivaa @actorvijay 😭💥💥
BLOCKBUSTER🔥🔥🔥🔥#GOATFDFS #GOATReview#TheGreatestOfAllTime #TheGOATpic.twitter.com/kdvsXbvrrG
— Mᴜʜɪʟツ𝕏 (@MuhilThalaiva) September 5, 2024
ఇంకొకరు ట్విట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని.. గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాడు. అంతేకాకుండా ఇంట్రో చాలా బాగుందని రాసుకొచ్చాడు.
#TheGOAT – First Half🏆🔥🔥🔥🏆
Intro absolute banger🔥🔥🔥🔥
Mmalaaaaa Intervallll🔥🔥🔥🔥🔥🔥🔥
pic.twitter.com/aqNXIbl5Go— KUMARAN (@Kumaran0115) September 5, 2024