Gundeninda GudiGantalu Today episode April 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉగాది రోజున ముగ్గు పెట్టినమీనా పై ప్రశంసలు కురిపిస్తారు. ఈ పొంగల్ అవ్వగానే అందరూ గుడికి వెళ్ళాలి అని అంటారు. రోహిణి వెళ్లి వాళ్ళ మామయ్యని పిలుచుకోవాలి రోహిణి మాణిక్యంకు ముందే వార్నింగ్ ఇచ్చి మరీ తీసుకొని వస్తుంది. ముగ్గురి కోసం మూడు కుండలో ప్రసాదం అందిస్తుంది సుశీల. ప్రభావతిని ఆ కుండలని కోడలు తల మీద పెట్టి కిందకు వలకకుండా గుడి దగ్గరికి తీసుకురావాలని చెప్తుంది. అందరూ తల మీద ప్రసాదంతో గుడికి వెళ్తారు. గుడిలో పూజ అయిన తర్వాత మళ్లీ ఇంటికి వచ్చి ప్రసాదంని తింటారు. మాణిక్యం మాత్రం మటన్ అంటూ తన బుద్దిని బయటపెట్టేస్తాడు. బాలుకు అనుమానం ఇంకా పెరిగి పోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ కలిసి లోపలికి వెళ్లి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. పనిలో పనిగా మనోజ్ కు బిజినెస్ పెట్టించాలనే ప్లాన్ బయట పెట్టేస్తారు ప్రభావతి మనోజ్.. బాలు మాత్రం మనోజ్ కి జాబ్ లేదని సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు. బిజినెస్ పెట్టించాలనే కోరిక ఉంది మీరు కొంచెం సాయం చేస్తే బిజినెస్ చేస్తానని మనోజ్. రోహిణి వాళ్ళ నాన్నకు పెద్ద బిజినెస్ మాన్.. తల్లి చనిపోయిందని రోహిణి తో అనగానే బ్రతికున్న తల్లిని చంపేస్తున్నా అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. మళ్లీ లోపలికి వచ్చిన రోహిణి మీ అమ్మ కోసం బాధపడ వద్దని అందరు అంటారు. బయటకొచ్చి మళ్ళీ రోహిణి బాధపడుతూ ఉంటే ప్రభావతి మీనా శృతి సుశీల అందరూ బాధపడవద్దని ఓదారుస్తారు.
మరోవైపు రోహిణి వాళ్ళ మామ ఖచ్చితంగా మలేషియా నుంచి రాలేదని బాలు ఈ నిజాన్ని ఎలాగైనా బయటపెట్టించాలని ప్లాన్ వేస్తాడు. రాజేష్ ని పిలిచి కళ్ళు తీసుకురమ్మని చెప్తాడు. ఇక మాణిక్యం దగ్గరికి వెళ్లి చిన్న పార్టీ ఉంది పండగ స్పెషల్ మీరు వస్తారా బాబాయ్ గారు అంటూ ప్రేమగా పిలుస్తాడు. బాలు ప్రేమను చూసి పొంగిపోయిన మాణిక్యం బాలు వెనకాలే వెళ్ళిపోతాడు. అక్కడ కళ్ళుని చూసి కంట్రోల్ చేసుకోలేక పోతాడు. ఇక బాలు కూడా మాకు కావాల్సింది కూడా ఇదే అని అతనికి కల్లు కుండలు ఇస్తూనే ఉంటాడు.
పాప ఏమి సీరియస్ అవ్వదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు మనోజ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇలా తాగుతున్నారు అని తెలిస్తే రోహిణి చాలా బాధపడుతుంది మీ మీద సీరియస్ అవుతుంది మీరు రండి బాబాయ్ గారు అంటూ మనోజ్ బ్రతిమలాడుతాడు. పాప ఏమి సీరియస్ అవ్వదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు బాబు అంటాడు. అని మాణిక్యం మనోజ్ ను పంపిస్తాడు.
మీ ప్రేమను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను బాలు అనేసి కల్లు తాగుతాడు. మొత్తం తాగాక బాలు ఫ్రెండ్ రాజేష్ మీరు మలేషియాలో ఏం పని చేస్తారు బాబాయ్ గారు, అసలు మీరు ఎక్కడ ఉంటారు అంటూ మెల్లగా ప్రశ్నలు మొదలు పెడతాడు. మలేషియాలో మీరు ఎలాంటి బిజినెస్ లు చేస్తారో తెలుసుకుందామని అని రాజేష్ అడుగుతాడు. ఇక బాలు కూడా అవును బాబాయ్ మీరు ఎలాంటి బిజినెస్ లు చేస్తారు అని అడుగుతాడు..
ఫుల్లుగా తాగిన మాణిక్యం నేనెక్కడుంటానో తెలుసా?.. ఏం బిజినెస్ చేస్తానో తెలుసా అని నోరు విప్పుతాడు. అలా మాణిక్యం చెప్పబోతూ మత్తులోకి జారుకుని స్పృహ తప్పి కింద పడిపోతాడు. వీడివాలకం వీడి భాష చూస్తుంటే కచ్చితంగా వీడు మలేషించి అయితే రాలేదని బాలుకు అనుమానం మొదలవుతుంది. ఎలాగైనా నిజాన్ని రాబట్టాలని అతన్ని కాస్త స్పృహ లోకి తీసుకొచ్చి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తాడు.
అటు రోహిణి మాణిక్యం ఎక్కడికెళ్లాడు అని వెతుకుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. విద్య కు ఫోన్ చేసి మాణిక్యం ఎక్కడికో వెళ్లిపోయాడని అడుగుతుంది. రోహిణి టెన్షన్ చూసి మనోజ్ బాలు దగ్గరే ఉన్నాడు వస్తాడులే నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అనేసి అంటాడు. కంగారు కాళ్లు చేతులు ఆడటం లేదు అని రోహిణి అనగానే.. అసలే మా మామయ్యకి ఈ ఊరు కొత్త ఎక్కడైనా తప్పిపోతే ఎలా వస్తాడని ఆలోచిస్తున్నా అని రోహిణి అంటుంది. అక్కడి తో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. సోమవారం ఎపిసోడ్ మాత్రం రసవత్తరంగా ఉంటుందని తెలుస్తుంది..