E-Paper
Advertisement

Horoscope Today April 2nd : ఆ రాశి వారు మిత్రులతో కలిసి ఎంజాయ్‌ చేస్తారు – వృత్తి, వ్యాపారాలలో లాభాలు

Horoscope Today April 2nd : ఆ రాశి వారు మిత్రులతో కలిసి ఎంజాయ్‌ చేస్తారు – వృత్తి, వ్యాపారాలలో లాభాలు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 2న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఇంట్లో ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

Advertisement

వృషభం: ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

మిధునం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి

Advertisement

కర్కాటకం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

సింహం: నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

కన్య: అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాల కలసివస్తాయి. వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

 తుల: రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు కలుగుతాయి. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం: ఇంటికి బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు : ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మకరం: జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కుంభం: కుటుంబ వ్యవహారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి.

మీనం: ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×