BigTV English
Advertisement

Horoscope  Today December 25th:    ఆ రాశి వారికి ఈరోజు అకస్మిక ధనలాభం – వాహనయోగం ఉంది

Horoscope  Today December 25th:    ఆ రాశి వారికి ఈరోజు అకస్మిక ధనలాభం – వాహనయోగం ఉంది

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 25న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. మాతృ సంభంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు.


మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంట్లో శుభాకార్యములు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చోటుచేసుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది.  ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. బంధు మిత్రుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.   పాత రుణాలు తీర్చగలుగుతారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో శుభాకార్య విషయమై చర్చలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Vastu Tips: ఉదయం లేవగానే.. ఈ వస్తువులు చూస్తే సమస్యలు కోరి కోని తెచ్చుకున్నట్లే ?

Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా.. ఈ దిశలో మొక్కలు పెట్టకూడదు !

Nandi in Shiva temple: శివాలయాల్లో నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి?

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Big Stories

×