చుండ్రు ఒక సాధారణ చర్మ సమస్య. మాడు మీద చనిపోయిన చర్మకణాలు పేరుకుపోయి మురికితో కలిసి చుండ్రుగా మారిపోతాయి. మాడుపై ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, చర్మం పొడిబారడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, సోరియాసిస్ వంటివి చుండ్రుకు కారణం అవుతాయి. మీకున్న సమస్యను బట్టి చుండ్రుకు తగిన చికిత్స తీసుకోవాలి. సోరియాసిస్, తామర వంటి వాటికి వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవలసిన అవసరం ఉంది.
ఇక సాధారణంగా చుండ్రు పడితే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా చుండ్రుని వదిలించుకోవచ్చు. చలికాలం అయినా కూడా తప్పకుండా మీ జుట్టును వారానికి రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనెతో మీ తలపై కాసేపు మసాజ్ చేసుకోండి. కొబ్బరినూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సహజమైన మాయిశ్చరైజర్లా ఉంటుంది. నెత్తి మీద లోతుగా చొచ్చుకుపోయి ఓదార్పును అందిస్తుంది.
కొబ్బరి నూనె లాగే లావెండర్ ఆయిల్ కూడా ఎంతో మేలు చేస్తుంది. తలపై చుండ్రు వల్ల వచ్చే దురదను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మీకు ప్రశాంతమైన ఫీలింగ్ లో ఇస్తాయి.
రోజ్‌మేరీ ఆయిల్
రోజ్ మేరీ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల మీకు చుండ్రు సమస్య చాలా వరకు తగ్గుతుంది. దీనిలో ఆస్ట్రింజెంట్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీ మాడు శుభ్రపడుతుంది. ఇది నూనె ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. తలకు నూనె రాసుకుని వర్షంలో తడవడం వంటివి చేయకండి. ఇది బ్యాక్టీరియాలకు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దురద, చుండ్రు వంటివి పెరిగిపోతాయి. అలాగే యోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయండి. ఈ రెండూ కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.