Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 6న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాల అందుతాయి.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
మిధున రాశి: ఈ రాశి నిరుద్యోగుల ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహ రాశి: ఈ రాశి ఉద్యోగస్తులు ఈరోజు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలలో భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. బంధు మిత్రులతో ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో ఎక్కడికైనా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ పిల్లల నుండి ఆనందాన్ని పొందుతారు. మీ పనిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. పరిజ్ఞానం ఉన్న స్నేహితుడి సలహాతో, మీ చెడిపోయిన పని ఈరోజు పూర్తవుతుంది. ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. మీ పనిలో వచ్చే అడ్డంకులను మీరు మాత్రమే తొలగించగలరు. మీకు సమయానికి సంబంధించిన పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. దీనివల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు అదిగమించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటికి ఆప్తుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. ఉద్యోగస్తులు అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.
మీన రాశి: ఈ రాశి వారికి పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. దీని వల్ల మీకు ప్రయోజనాలు చేకూరతాయి. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందొచ్చు. దీంతో మీరు ఆనందిస్తారు. మీరు స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈ సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలోని సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?